పెళ్లి ఫొటో ఫేస్‌బుక్‌లో పెట్టి భార్యను చంపి..

26 Sep, 2017 19:07 IST|Sakshi

వెస్ట్‌మిడ్‌ల్యాండ్‌ : అన్యోయంగా, అప్యాయంగా ఉంటున్న ఓ జంట జీవితం అనూహ్య మలుపు తిరిగి తీరని విషాదమైంది. ఎప్పుడూ ప్రేమగా తన భార్యతో మాట్లాడే భర్త కాస్త కాలయముడయ్యాడు. భార్యను చంపడమే కాకుండా తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెస్ట్‌మిడ్‌ల్యాండ్‌లో చోటు చేసుకుంది. 2014లో జేమ్స్‌(30), బేర్న్స్‌ (32) అనే ఇద్దరికి వివాహం అయింది. ఎంతో ప్రేమగా ఉంటున్న వారి మధ్య ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. తొలుత తమ వివాహం నాటి ఫొటోను ఫేస్‌బుక్‌లో పంచుకున్న జేమ్స్‌ అత్తగారింటికి వెళ్లాడు.

అక్కడి వెళ్లి వెళ్లగానే ఇంట్లో ఎవరూ లేనిది చూసి భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 20 మైళ్ల దూరంలో ఉంటున్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారు జామున పోలీసులు వారి మృతదేహాలు గుర్తించారు. 'మేం ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాం. వారు ఎంతో ప్రెండ్లీ కపుల్స్‌.. ఈ వార్త విన్నాక మేం షాక్‌ తిన్నాం. వారిద్దరి మధ్య చంపుకునేంత గొడవ ఉందంటే మేం నమ్మలేకపోతున్నాం' అని అక్కడి చుట్టుపక్కల వారు తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు