అనుమానం పెనుభూతమై..

4 Apr, 2018 09:46 IST|Sakshi
బిడ్డలతో మృతురాలు రుక్మిణి (ఫైల్‌)

భర్త చేతిలో భార్య దారుణహత్య

అనాథలైన బిడ్డలు

మదనపల్లె క్రైం: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను.. ఓ భర్త అతికిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మదనపల్లెలో చోటు చేసుకుంది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన పై పోలీసులు, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె పట్టణంలోని అనపగుట్టకు చెందిన సురేంద్ర అలియాస్‌ సూరి(40) పదిహేనేళ్ల క్రితం క్రితం స్వగ్రామం కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ గొడ్డిండ్లపల్లె నుంచి వచ్చి అనపగుట్టలో స్థిరపడ్డాడు. స్థానికంగా ఉంటూ చిన్నచిన్న  దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం వెళ్లిన సూరికి ముళబాగళ్‌ సమీపంలోని హెచ్‌.గొల్లపల్లెకు చెందిన రత్నమ్మ, శీనప్ప దంపతుల కుమార్తె రుక్మిణి(38)ని పెళ్లి చేసుకున్నాడు.

ఇది వరకే 20 ఏళ్ల క్రితం రుక్మిణికి లక్ష్మణప్పతో మొదటి సారి వివాహం అయింది. వీరికి రెడ్డి కిషోర్‌ కుమారుడు ఉన్నాడు. సూరికి  కూడా ఇది వరకే పెళ్లి అయి భార్య వదిలేసింది. కాగా రుక్మిణి రెండో భార్య. ఈమె ఎస్టేట్‌లోని ఓ గార్మెంట్స్‌ ఫ్యాక్టరీలో పనికి వెళ్తుండేది. వీరికి నేత్రా(7)  కుమార్తె ఉంది. భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరచూ గొడవలు పడేవారు. రోజూ మాదిరిగానే సోమవారం పనికి వెళ్లి ఇంటికి వచ్చిన రుక్మిణితో సూరిగొడవపడ్డాడు. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రిస్తుండగా ఇంటిలోని రోకలి బండతో భార్య తలపై మోదాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను స్థానికులు గుర్తించి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సూరిపై 2009లో హత్యకేసు, 2012 దారి దోపిడీ, హత్య కేసులు ఉన్నాయి. సమాచారం అందుకున్న టూటౌన్‌ సీఐ సురేష్‌కుమార్, ఎస్‌ఐ కృష్ణయ్య, సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని విచారణ అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమ పెళ్లి: అనుమానంతో అతి కిరాతకంగా..

ప్రజాసేవలో సైబర్‌ మిత్ర!

ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో దారుణం

గుంతను తప్పించబోయి..

షాపింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం..!

బీజేపీ నేత దారుణ హత్య.. సంచలన తీర్పు

రా‘బంధువు’!

కొలిక్కి రాని కిడ్నాప్‌ కేసు..

గోవధ : మాజీ ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు..!

నిత్య పెళ్లి కొడుకు అరెస్టు

మెన్స్‌పార్లర్‌లో గొడవ

పరామర్శకు వెళ్లి మృత్యు ఒడికి.. 

నింద శరాఘాతమై.. మనసు వికలమై..

మూ​కహత్య : మరో దారుణం

మైనర్‌ బాలిక కిడ్నాప్‌ కథ సుఖాంతం

తల్లి పేరున ఇన్సూరెన్స్‌ కట్టి హత్య...

ఆరూష్‌ ఎక్కడ?

ఒక భర్త... నలుగురు భార్యలు

హైకోర్టులో కోడెల కుమార్తెకు చుక్కెదురు

పిన్నికి నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి..

దొంగను పట్టించిన 'చెప్పు'

భార్యను కాల్చబోతే...తల్లి మృతి

లాటరీ పేరిట రూ.70 లక్షల మోసం

ప్రియుడ్ని బెదిరించిన ప్రియురాలి మేనమామ

యువతి కిడ్నాప్‌; కీలక ఆధారాలు లభ్యం..!

ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించాడు

తాళం వేసిన ఇళ్లే వీరి టార్గెట్‌

ఇది కథ కాదు..బిచ్చగాడి ముసుగులో 

వేర్వేరు చోట్ల.. వ్యక్తుల అదృశ్యం

వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!

హీరోయినా..? ఐటమ్‌ గర్లా?

‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు

దిమాక్‌ ఖరాబ్‌.. దిల్‌ ఖుష్‌!

ఇద్దరం.. వెంకటేష్‌ అభిమానులమే..