కుమార్తెను చూసి వద్దామన్నందుకు.. 

28 Jul, 2018 07:11 IST|Sakshi
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు 

మల్కాజిగిరి : కన్నపేగుపై మమకారం ఓ హత్యకు దారితీసింది. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కొమరయ్య కథనం మేరకు వివరాలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా, చెల్లూరుకు చెందిన వెంకటరమణ, లక్ష్మి అలియాస్‌ చంటమ్మ(55) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. బతువుదెరువు నిమిత్తం  రెండు నెలల క్రితం భార్యతో నగరానికి వలస వచ్చిన వెంకటరమణ గౌతంనగర్‌లోని మేఘన కుటీర్‌ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. దివ్యాంగురాలైన కుమార్తె శ్రీదేవికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఆమెను చూసివద్దామని భర్తను కోరుతోంది.

ఈ విషయమై గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతున్నట్లు సమాచారం. గురువారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో వెంకటరమణ గదిలో ఉన్న మోటర్‌తో లక్ష్మి తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి సోదరి బుజ్జమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరమణను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు