వివాహిత దారుణహత్య

3 May, 2019 11:53 IST|Sakshi
మహేశ్వరి(ఫైల్‌) తల్లి మృతితో అనాథ అయిన చిన్నారి

భర్తే హంతకుడు

కర్నూలు, పత్తికొండ టౌన్‌: పట్టణంలో ఓ వివాహిత గురువారం కట్టుకున్న భర్త చేతిలోనే దారుణహత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక మడ్డిగేరి కాలనీకి చెందిన సూర్యనారాయణ, భూషమ్మ దంపతుల కుమార్తె మహేశ్వరిని చక్రాళ్లరోడ్డు కొండగేరిలో నివాసం ఉంటున్న నాగభూషణం, సంజమ్మ దంపతుల కుమారుడు రవికి ఇచ్చి రెండేళ్లక్రితం వివాహం చేశారు. వీరికి 8 నెలల కూతురు ఉంది. రవి, మహేశ్వరి దంపతులు జీవనోపాధి కోసం రాజంపేటకు వలస వెళ్లారు. బంధువులు గద్దెరాళ్ల దేవర చేస్తుండటంతో వారం రోజుల క్రితం స్వగ్రామం పత్తికొండకు వచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భార్యాభర్త గొడవపడ్డారు. భర్త రవి, అత్తమామలు మహేశ్వరిని తీవ్రంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది.

అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. ఉదయం ఏమీ తెలియని వారి మాదిరిగా ఫిట్స్‌ వచ్చి పడిపోయిందని చెప్పి, మహేశ్వరి మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యసిబ్బంది ధ్రువీకరించారు. తమ కూతురు మహేశ్వరిని పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్తమామలు నిత్యం అనుమానంతో శారీరకంగా, మానసికంగా వేధిస్తూ, తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, వారే కొట్టిచంపారని మృతురాలి తండ్రి సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐ విజయకుమార్‌ పోలీసు సిబ్బంది ఆస్పత్రికి వెళ్లి మహేశ్వరి మృతదేహాన్ని పరిశీలించారు. భర్త రవి, అత్తమామలు నాగభూషణం, సంజమ్మలను అదుపులోకి తీసుకుని పోలీసుశైలిలో విచారించడంతో హత్యానేరం అంగీకరించారు. ఈ మేరకు వారిపై హత్యకేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణయ్య తెలిపారు. కాగా తల్లి మృతిచెందడం, తండ్రిని పోలీసులు అరెస్టు చేయడంతో ఏ పాపం ఎరుగని 8నెలల చిన్నారి అనాథగా మిగలడాన్ని చూసిన పలువురు చలించిపోయారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విడాకుల కోసం.. భార్యను స్నేహితుడితో..

వైఎస్‌ జగన్‌పై దాడి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

అపూర్వ శుక్లాపై చార్జీ షీట్‌ దాఖలు

కన్నతల్లి కర్కశత్వం; చిన్నారి గొంతుకోసి..

హల్దీ బచావో..

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

వివాహేతర సంబంధం: భర్తకు తెలియకుండా 95 వేలు..

తనతో ప్రాణహాని; అందుకే నేనే చంపేశా!

వేటాడుతున్న నాటు తూటా

ఐదేళ్ల తర్వాత ప్రతీకారం..!

ఒంటరి మహిలళే వారి టార్గెట్‌!

ప్రియురాలి ఇంటి ఎదుట ప్రియుడి ఆత్మహత్య

ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ మృతి

మోసం: వయస్సు తప్పుగా చెప్పి పెళ్లి!

మలుపులు తిరుగుతున్న శిశువు కథ

ఉద్యోగమని మోసం చేసిన డీఎస్పీ!

అమ్మాయి చేతిలో ఓడిపోయానని..

దొంగలు బాబోయ్‌.. దొంగలు 

ప్రేమ... పెళ్లి... విషాదం...

నమ్మించాడు..  ఉడాయించాడు!

చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలతో కుచ్చుటోపీ!

విదేశీ ఖైదీ హల్‌చల్‌

భార్య ప్రియునిపై పగ; తొమ్మిదిమందికి షాక్‌..!

ప్రియుడు మోసం చేశాడని..బాలిక ఆత్మహత్య

అయ్యో! రూ.2 వేల కోసం విషా(వా)దం

సెల్ఫీ వీడియో తీసి బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

క్యాషియర్‌పై దాడి చేసిన దొంగలు దొరికారు

ట్రిపుల్‌ రైడింగ్‌.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి..!

బెట్టింగ్ చేసినందుకు ఐదుగురు అరెస్టు

డైరెక్టర్‌ రాజమౌళి.. యాక్టర్‌ లాయర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు