అనుమానం హత్యకు దారితీసింది

8 Sep, 2018 15:55 IST|Sakshi
భీమమ్మ మృతదేహం, మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ ఉపేందర్‌

బషీరాబాద్‌ : అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎక్మాయి గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తాండూరు రూరల్‌ సీఐ ఉపేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్మాయి గ్రామానికి చెందిన సందాపురం భీమమ్మ(38), ఎల్లప్ప భార్యభర్తలు. వీరు చాలా కాలంగా హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో నివాసముంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగించేవారు. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన తగాదాలతో ఐదేళ్ల పాటు విడిపోయారు. మళ్లీ పెద్దల సమక్షంలో పెట్టిన పంచాయతీతో ఐదు నెలల క్రితం మళ్లీ వీరిద్దరూ ఒక్కటయ్యారు.

అప్పటి నుంచి వీరి కాపురం బాగానే సాగింది. అయితే రెండు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన భీమమ్మను భర్త ఎల్లప్ప వెంటనే రావాలని ఎక్మాయికి తీసుకువచ్చాడు. అదే రోజు రాత్రి 10 గంటల తర్వాత భార్యతో గొడవకు దిగాడు. తాను దూరంగా ఉన్న కాలంలో  అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో శారీరకంగా హింసించాడు. అంతడితో ఆగకుండా ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో భార్య భీమమ్మ తలపై విచక్షణ రహితంగా కొట్టాడు. దీంతో ఆమె ఇంట్లో అపస్మారకస్థితిలో పడిపోయింది. విషయం ఇరుగు పొరుగు వారికి తెలియడంతో భర్త ఇంట్లో నుంచి పరారయ్యాడు.

అప్పటికే సమాచారం అందుకున్న రూరల్‌ సీఐ ఉపేందర్‌ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్యను తీవ్రంగా కొట్టి పారి పోతున్న భర్త ఎల్లప్పను గాలించి అదుపులోకి తీసుకున్నారు. అయితే కొన ఊపిరితో ఉన్న భీమమ్మను బతికించేందుకు సీఐ 108కు సమాచారం అందించాడు. కాగా ఆ వాహనంలోని సిబ్బందిని భీమమ్మను పరీక్షించగా అప్పటికే ఆమె మృతిచెందింది. ఈ ఘనటపై భీమమ్మ కొడుకు నరేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఎల్లప్పను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యువతిని గర్భవతిని చేసి.. కానిస్టేబుల్‌ నిర్వాకం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

బస్టాండ్‌లో పంది దాడి.. ముగ్గురికి గాయాలు

కొడుకుపై తల్లిదండ్రుల పైశాచికత్వం

యువతిపై హత్యాయత్నం..

కలకలం రేపుతున్న హషమ్‌బేగ్‌ హత్య

శోకాన్ని మిగిల్చిన శ్రావణి

వైద్య ఉద్యోగి కిడ్నాప్‌ కలకలం

గోదారి తీరం.. కన్నీటి సంద్రం

వివాహిత అనుమానాస్పద మృతి

భర్త అనుమానం..భార్య బలవన్మరణం

రేవ్‌ పార్టీలో మజా చేసిన మంత్రుల కొడుకులు

జ్యోత్స్న మృతిపై దర్యాప్తు ముమ్మరం

వరకట్న వేధింపులకు నవవధువు బలి

టీటీఈపై రైల్వే ప్రయాణికుడి దాడి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు..?!

పూజారి దారుణ హత్య

ప్రేమించకుంటే యాసిడ్‌ పోస్తా!

పెళ్ళై ఐదు రోజులకే నవవధువు ఆత్మహత్య

అయ్యయ్యో.. ఎంత కష్టం!

మయన్మార్‌ టు హైదరాబాద్‌

వ్యభిచార కేంద్రం నిర్వాహకుడి అరెస్ట్‌

పూనం కౌర్‌ కేసు.. 36 యూట్యూబ్‌ లింక్‌లు

టార్గెట్‌ సెల్‌ఫోన్స్‌!

‘స్కిమ్మింగ్‌’తో దోపిడీ!

1,381 కేజీల బంగారం సీజ్‌

కోడెలపై కేసు.. అరెస్ట్‌కు వెనుకంజ

డేటా దొంగలకు ఢిల్లీ లింక్‌!

గుప్తనిధుల కోసం తవ్వకం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇన్‌స్టాగ్రామములో అడుగుపెట్టారు

జూన్‌లోపు నిర్ణయిస్తా

47 రోజుల సస్పెన్స్‌

వీకెండ్‌ పార్టీ ఛలో ఛలో

కామెడీ టు సీరియస్‌

తెలంగాణ తెస్తనంటే నవ్విండ్రు