చంపేసి.. దుప్పట్లో శవాన్ని తీసుకొచ్చి

27 Jun, 2019 07:36 IST|Sakshi
బుడ్డమ్మ మృతదేహం బుడ్డమ్మ (ఫైల్‌)

కర్రతో భార్యను కొట్టి చంపిన భర్త

పొలం నుంచి ఇంటికి వస్తుండగా దాడి

అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన వైనం

షాబాద్‌(చేవెళ్ల): కుటుంబ కలహాలతో భర్త తన భార్యను కడతేర్చిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలోని బిక్యాతండాలో చోటు చేసుకుంది. షాబాద్‌ ఎస్‌ఐ రవికుమార్‌ కథనం ప్ర కారం.. మండలంలోని మద్దూర్‌ అనుబంధ బిక్యాతండాకు బుడ్డమ్మ(35), కేతావత్‌ తావ్‌ దంపతు లు.  వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నా రు. పెద్ద కూతురు వివాహం కూడా అయిపోయింది. తాగుడుకు బానిసైన కేతావత్‌ తావ్‌ డబ్బులు ఇవ్వాలని భార్యతో నిత్యం గొడవ పడేవాడు. ఈ విషయమై బుడ్డమ్మ తల్లిదండ్రులు పలుమార్లు అల్లుడుకి నచ్చజెప్పినా అతడిలో మార్పురాలేదు. మంగళవారం ఉదయం పొలం పనికి వెళ్లిన దంపతులిద్దరూ సాయంత్రం ఇంటికి చేరే సమయంలో మార్గమధ్యలోనే గొడవపడ్డారు. మాటమాటా పెరగడంతో భర్త తావ్‌ పక్కనే ఉన్న కర్రతో భార్య బుడ్డమ్మపై దాడి చేశాడు.

తీవ్రంగా గాయపడిన బుడ్డమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. భార్య మృతదేహాన్ని దుప్పట్లో మూటకట్టుకొని ఇంటికి తీసుకువచ్చి పడుకోబెట్టాడు. బుధవారం తెల్లవారుజామున ఆమె నిద్ర లేవకపోవడంతో కుటుంబీకులు దగ్గరకు వెళ్లి చూసి బుడ్డమ్మ మృతిచెందినట్లుగా గుర్తించారు. తన సోదరి మృతికి ఆమె భర్తనే కారణమని, తాగుడుకు బానిసై భార్యను తరచూ వేధించేవాడని మృతురాలి సోదరుడు అంగోతు దాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

న్యాయం జరగలేదు అందుకే చచ్చిపోవాలనిపించింది

ప్రాణాలు తీసిన స్టాపర్‌

ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం

ప్రాణం తీసిన బిందె

మద్యం తాగి కాక్‌పిట్లో ప్రయాణం

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

స్కెచ్చేశాడు.. చంపించాడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

సీఎం పీఏ అంటూ..డబ్బులు డిమాండ్‌

కాగ్నిజెంట్‌ ఉద్యోగి ఆత్మహత్య

బాలికను వేధించిన వాచ్‌మెన్‌కు దేహశుద్ధి

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

రూ. 3.3 కోట్లు దోచేసి.. దర్జాగా..

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

తల ఛిద్రం; మోడల్‌ దారుణ హత్య

బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

గిద్దలూరు వాసి చిత్తూరులో ఆత్మహత్య

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన యువతి..

అంత్యక్రియల అనంతరం నిలదీస్తే.. ఒప్పుకొన్న భర్త

తల్లి జబ్బుపడిందని.. కుమార్తె ఆత్మహత్య

సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

తమ్ముడిపై కొడవలితో దాడి

పోలీసునంటూ షాపులో దౌర్జన్యం

యువకుడి మృతదేహం లభ్యం

లారీ డ్రైవర్‌పై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి

టోల్‌గేట్‌ బిల్లింగ్‌ బూత్‌ను ఢీకొన్న లారీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం