గొడవపడిన భర్త..కాల్‌గర్ల్‌ పేరుతో భార్య ఫొటో పోస్టు

6 Oct, 2019 03:16 IST|Sakshi

నిందితుడిని అరెస్టు చేసిన రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు

సాక్షి,హైదరాబాద్‌: భార్యతో గొడవ పడిన విషయాన్ని మనస్సులో పెట్టుకుని సొంత భార్య ఫొటోనే సామాజిక మాధ్యమంలో పెట్టి అల్లరిపాలు చేసిన ఓ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లుగా కుషాయిగూడ ఈసీఐఎల్‌లోని రాధికా థియేటర్‌లో ప్రొజెక్టర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తోన్న జాన్‌ జార్జ్‌ అలియాస్‌ సన్నీ దమ్మాయిగూడలోని లక్ష్మీనగర్‌ కాలనీలో కుటుంబంతో కలసి ఉంటున్నాడు. ఈ మధ్యలో చిన్నచిన్న విషయాల్లో మనస్పర్థలు వచ్చి గొడవలు జరగడంతో ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్నాడు. ఎలాగైనా తన భార్య వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చాలను కున్న సన్నీ ఆమె తన స్నేహితురాళ్లతో దిగిన ఫొటోలను షేర్‌చాట్‌లో పోస్టు చేశాడు. ఆ ఫొటోలో ఉన్నవారంతా కాల్‌గర్ల్స్‌ అని కామెంట్‌ చేయడంతో పాటుగా వాయిస్‌ ఇచ్చాడు. ఆ ఫొటోకింద భార్య ఫోన్‌ నంబర్‌ను పేర్కొన్నాడు. దీంతో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అతడి భార్యకు ఫోన్‌కాల్స్‌ రావటంతో బాధితురాలు శనివారం రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు టెక్నికల్‌ డేటా ఆధారంగా నిందితుడు సన్నీని శనివారం అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు