కీర్తికి మద్యం తాగించి‌.. రజిత గొంతు నులిమిన శశి

30 Oct, 2019 12:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తల్లిని పాశవికంగా హత్య చేసిన కీర్తి ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీర్తితో పాటు ఆమె ప్రియుడు శశికుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తన తల్లి రజితను తామిద్దరం కలిసి హతమార్చినట్లు నేరం అంగీకరించిన కీర్తి.. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించింది. వివరాలు.. ఈ నెల 19న కీర్తి తల్లి రజిత కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లిన సమయంలో శశి వాళ్లింటికి వచ్చాడు. ఆమె తిరిగి వచ్చేసరికి శశితో కీర్తి కలిసి ఉండటం గమనించిన రజిత వాళ్లిద్దరినీ మందలించింది. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన శశి రజిత అడ్డు తొలగించుకుంటేనే తామిద్దరం కలిసి ఉండవచ్చని కీర్తికి చెప్పాడు.( చదవండి : వీడియోలున్నాయ్‌..చంపేస్తావా లేదా?!)

అనంతరం బీర్‌ బాటిల్స్‌తో కీర్తి ఇంటికి వచ్చాడు. కీర్తి తల్లి రజిత లోపల గదిలో ఉండగా ఇంటి ఆవరణలోనే కీర్తికి శశి మద్యం తాగించి రజితను హత్య చేసేలా ప్రేరేపించాడు. తర్వాత ఇద్దరూ ఇంట్లోకి వెళ్లగా.. శశి లోపలి నుంచి తలుపు గడియ వేశాడు. పథకం ప్రకారం తల్లి అరవకుండా కీర్తి ఆమె ముఖంపై దిండుతో నొక్కగా.. శశి చున్నీతో రజిత గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ఉరివేసుకున్నట్లుగా అందరినీ నమ్మించారు. అనంతరం మూడు రోజుల పాటు శవాన్ని అక్కడే పెట్టుకుని గడిపారు. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో యాదాద్రి జిల్లా రామన్నపేట రైల్వేగేట్‌ వద్ద పడేసి ఇంటికి చేరుకున్నారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన విషయాలు పోలీసులు వెల్లడించారు. కీర్తి ఇంట్లో నుంచి మూడు బీర్ బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ హత్యలో ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు