ఆమే కావాలి

12 Nov, 2017 07:38 IST|Sakshi

విదేశీ ఉద్యోగం మానుకున్నా..!

పెళ్లిచేయకుంటే కోర్టుకెళతా..

పోలీసులకు ప్రేమికుడి ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌ ‌: ఇద్దరం ప్రేమించుకున్నాం..పెళ్లి చేసుకోవాలనుకున్నాం..పెద్దలుకూడా ఒప్పుకున్నారు.. ఇపు డు ఆమెపెళ్లి వద్దంటోంది.. ఆమె కోసం విదేశీ ఉద్యోగాన్నే వదులుకున్నా.. ఇపుడు నా పరిస్థితేంటి అంటూ ఓ యువకుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌పరిధిలో జరిగింది.

ఫిలింనగర్‌లోని దుర్గాభవాని నగర్‌లో నివసించే ఎలక్ట్రీషియన్‌ జామ మహేష్‌ (24) రెండేళ్లుగా అదే ప్రాంతంలో నివసిస్తున్న యువతి(22)ని ప్రేమిస్తున్నాడు. పెళ్ళికి ఇద్దరి కుటుంబాలు ఒప్పుకున్నాయి. అయితే ఏమైందో.. ఏమో ఇప్పుడు ఆ యువతి పెళ్లిచేసుకోనంటోంది. దీంతో మహేష్‌ విస్తుపోయాడు. బతిమాలినా ఒప్పుకోకపోవడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు.

ఆమె కోసం ఎన్నో త్యాగాలుచేశానని విదేశాల్లో ఉద్యోగం వస్తే కూడా ఆమె వద్దన్నదని వదులుకున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం జరుగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.       

        మహేష్‌

మరిన్ని వార్తలు