క్యూనెట్‌ స్కాంలో 70 మంది అరెస్టు

27 Aug, 2019 14:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : క్యూనెట్‌ స్కామ్‌లో 70 మందిని అరెస్ట్ చేసి వారిపై 38 కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి బెంగుళూరులో రూ. 2.7 కోట్ల నగదును సీజ్‌ చేసినట్లు, క్యూనెట్‌ను ప్రచారం చేసిన సినీ ప్రముఖులకు నోటిసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. క్యూనెట్‌ సంస్ధ మల్టిలెవల్ మార్కెటింగ్ పేరుతో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మోసం చేస్తున్నారని, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో బాధితులు ఉన్నట్లు వెల్లడించారు. క్యూనెట్‌ కంపెనీకి సంబంధం లేని వ్యక్తులు కూడా పెట్టుబడుల్లో వచ్చిన డబ్బుని వాడుకుంటున్నారని, దేశ వ్యాప్తంగా క్యూనెట్‌ సంస్థ 5 వేల కోట్ల రూపాయలు మోసం చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.

ఈ సంస్థపై అనేక ఫిర్యాదులు అందడంతో ఈ కేసును లోతుగా విచారించాలని రిజిస్టార్‌ ఆఫ్ కంపెనీస్‌ ఆదేశాలు ఇచ్చిందన్నారు. 15 రోజుల క్రితం క్యూనెట్‌ బాధితుడు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సైబరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడని, మరో వ్యక్తి సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్యూనెట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులు దేశం దాటి పోకుండా 12 మందిపై లుక్ ఔట్ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. కేవలం డబ్బులు వసూలు చేయడమే వీరి పని అని, ఇలాంటి మార్కెటింగ్‌ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు. క్యూనెట్‌కు ఎలాంటి రికార్డులు లేవని, రూ.100 విలువ చేసే వస్తువు రూ.1500 కి అమ్మకాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. 

ఉద్యోగులకు టోకరా వేసిన ముఠా గుట్టు రట్టు
బ్యాంకు ఉద్యోగులను మోసం చేసిన ముఠా గుటు రట్టు అయ్యింది. బ్యాంక్‌ ఉద్యోగులను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న గ్యాంగ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాకు చెందిన నలుగురిని అరుణ్‌, లోకేష్‌ తోమర్‌, మోహిత్‌ కుమార్‌, మనోజ్‌ కుమార్‌ను అరెస్టు చేసినట్లు కమిషనర్‌ సజ్జనార్‌ వెల్లడించారు. పెద్ద కార్ల షో రూమ్‌లను వేదికగా చేసుకొని దేశ వ్యాప్తంగా భారీ మోసాలు చేస్తూ అనేక మందిని మోసం చేసినట్లు పేర్కొన్నారు. కావున బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సరైన సమాచారం లేకుండా డబ్బులు బదిలీ చేయవద్దని సూచించారు. నిందితుల నుంచి మూడు లక్షల నగదుతోపాటు ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సుబ్బిరామిరెడ్డి అన్న కొడుకు ఇంట్లో భారీ చోరీ

తండ్రి వివాహేతర సంబంధం.. కుమార్తె ఆత్మహత్య

రమేష్‌ హత్య వెనుక రహస్యాలనేకం..!

మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని.. ఖమ్మంలో ఘాతుకం

బైక్‌ మోజులో పడి.. మేనత్తకే కన్నం

గంటలో మూడు ఫోన్లు చోరీ

బడా బిజినెస్‌మెన్‌ అంటూ వలేస్తాడు

‘పార్శిల్స్‌’ కేసులో నిందితుడి అరెస్టు

పేషెంట్‌ బ్యాగు తీసి పక్కన పెట్టినందుకు..

చీటింగ్‌ కేసులో తల్లీకొడుకు అరెస్ట్‌

జిల్లాలో ఉగ్రవాదులు లేరు: సీపీ కార్తికేయ

ఎట్టకేలకు మోసగాళ్ల అరెస్ట్‌ 

వ్యభిచారం చేయమని వేధిస్తున్న తండ్రి అరెస్టు!

మూడేళ్ల బాలుడిపై లైంగిక దాడి

కాటేసిన కాలువ

చిన్న దొంగ అనుకుంటే.. పెద్ద ‘చేప’ దొరికింది

పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

లవ్‌ ఆర్ట్స్‌ పేరుతో కాల్‌ సెంటర్‌.. డేటింగ్‌ ఆఫర్స్‌

శిశువును ఒడిలో దాచుకుని బాలింత ప్రాణత్యాగం

ప్రేమ పేరుతో ఒకడు.. దాని ఆసరాగా మరొకడు..!

తెలిసిన వ్యక్తే కదా అని లిఫ్ట్‌ అడిగితే..

రైలు నుంచి విద్యార్థి తోసివేత 

వృద్ధ దంపతులపై కోడలి దాష్టీకం!

వాస్తు పూజల పేరిట మోసం

అసభ్యకరంగా మాట్లాడాడని..

పోర్టులో మరో ప్రమాదం

కుటుంబాలు చితికిపోతున్నాయ్‌!

93 నిమిషాలకో ప్రాణం!

కోల్‌కతాలో హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెప్టెంబర్ 8న ‘సినీ రథసారథుల రజతోత్సవం’

పాటల తోటలో ఒంటరి సేద్యం!

గురుశిష్యుల మధ్య ‘వార్‌’

అమ్మకు ప్రేమతో.. దేవీ శ్రీ ప్రసాద్

‘ఇక్కడ రచయితలకు గౌరవం లేదు’

ప్రేమ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు