డాక్టర్‌ నంద కిషోర్‌ అరెస్టు

9 Feb, 2019 13:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్న ముగ్గురు ఎంబీబీఎస్‌ డాక్టర్లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో లోకల్‌ షీటీంతో కలిసి ఇబ్రహీంపట్నం, మేడిపల్లిలోని రెండు డయాగ్నోస్టిక్‌ సెంటర్లపై దాడి చేశామని రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు. డాక్టర్‌ నందకిషోర్‌, మరో ఇద్దరు వైద్యులను అరెస్టు చేశామని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షల అనంతరం ఆడపిల్ల వద్దనుకునే వారికి అబార్షన్‌ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని చెప్పారు.  ఆడ సంతానం వద్దనుకునేవారు బలవంతంగా అబార్షన్ చేయించే క్రమంలో గర్భిణీ ప్రాణాల పోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ ఘటనపై ఇండియన్‌ మెడికల్‌​ అసోషియేషన్‌ (ఐంఎంఏ) కు పూర్తి నివేదిక ఇవ్వనున్నామని తెలిపారు. ఐంఎంఏ చట్టంలో పేర్కొన్న విధంగా వైద్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు