చెల్లి సమక్షంలో అక్కపై అత్యాచారం

14 Dec, 2019 12:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : చెల్లెలిని చంపుతానని బెదిరించి ఆమె సమక్షంలోనే అక్కపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఈ నెల 8వ తేదీన ఈ ఘటన జరగగా, అలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆదివారం చార్మినార్‌ వెళ్లేందుకు హష్మబాద్‌ వద్ద ఆటో కోసం అక్కాచెల్లెలిద్దరూ వేచి చూస్తున్నారు. వీరిని చూసిన ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ అమీర్‌ దగ్గరికి రాగా, చార్మినార్‌తో పాటు జహంగీర్‌ పీర్‌ దర్గాకు తీసుకెళ్లమని అక్కాచెల్లెళ్లు అడిగారు. అయితే సాయంత్రం సమయంలో దర్గాకు వెళ్లడం మంచిది కాదని, తెల్లారి తీసుకెళ్తానని వారిని వారించి, మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో వాళ్లు నిలదీయడంతో అమీర్‌ సోదరుడు మూసా కల్పించుకొని వీరిద్దరినీ నాంపల్లిలో దింపుతానని తన ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు.

అక్కడ స్థానిక హోటల్‌గ్రాండ్‌లోని ఓయో రూం బుక్‌ చేసి, చెల్లెలిని చంపుతానని బెదిరించి అక్కపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం వాళ్లను ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. మరోవైపు అక్కాచెల్లెళ్లు కనిపించడం లేదంటూ 8వ తేదీన వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, రైల్వేస్టేషన్‌ వద్ద తచ్చాడుతున్న అక్కాచెల్లెళ్లను చూసి రైల్వే పోలీసులు చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారమందించగా, బాధితులను విచారించిన పోలీసులు  అత్యాచారం జరిగినట్టు తెలుసుకున్నారు. నాంపల్లిలోని హోటల్‌కు వెళ్లి విచారించగా, ఓయో రూమ్‌ కోసం నిందితుడు నకిలీ గుర్తింపు కార్డులిచ్చినట్టు గుర్తించారు.       

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అశ్లీల చిత్రాల వీక్షణ: రాజకీయ నేతల విచారణ!

‘సల్మాన్‌ ఇంట్లో బాంబు.. దమ్ముంటే ఆపుకోండి’

ప్రియాంక గాంధీ సన్నిహితురాలికి సీబీఐ షాక్‌

‘నేను చచ్చిపోతా.. నా భర్తను కాపాడండి’

దిశ కేసు: నిందితుల డీఎన్‌ఏలో కీలక అంశాలు

కన్నతల్లే కఠినాత్మురాలై..

గర్భిణిపై ముగ్గురి లైంగికదాడి

విద్యార్థినికి పెళ్లి.. తాళిని తీసి పాఠశాలకు

మ‘రుణ’ మృదంగం!

అడ్డుగా ఉన్నాడనే దారుణం..

పెట్రోల్‌ దాడిలో గాయపడిన వాచ్‌మెన్‌ మృతి

ఆయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం

రెండు ముఠాలు... ఏడుగురు దొంగలు!

మెడికల్‌ షాప్‌ వైద్యం, చిన్నారి మృతి

వ్యాపారి ఆత్మహత్య.. సీఎం కేసీఆర్‌కు సందేశం

ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య

తత్కాల్‌..గోల్‌మాల్‌

సకుటుంబ.. సపరివార సమేతంగా

ఫైనాన్స్‌ పేరుతో మోసం.. కోటిన్నరతో పరార్‌

అత్తపై అఘాయిత్యం.. భార్యకు విడాకులు

చోరీలకు ముందు.. ఓ దొంగ నేరచరిత్ర విచిత్రం..

‘పరిధి’ని చెరిపి.. ప్రాణాలు నిలిపారు

బ్రేకింగ్‌ : మాజీ ఎంపీ హర్షకుమార్‌ అరెస్టు

భార్య ఎదుటే కుమార్తె పీక కోసి చంపిన తండ్రి

దయచేసి ఎవరూ ఇలా చేయకండి..

‘బంగారు’ బ్యాగు కథ సుఖాంతం!

ఇష్టం లేని పెళ్లి చేశారని నవ వరుడు..

లారీ దూసుకెళ్లి దంపతులు దుర్మరణం

దిశ కేసు: స్పష్టమైన ఫోరెన్సిక్‌ ఆధారాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కేజీఎఫ్‌-2 ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఎప్పుడంటే...

మర్దానీ-2: తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే!

మీ మీద ఒట్టు.. ఆ ముగ్గుర్నీ ప్రేమిస్తున్నా: వర్మ

పవర్‌ఫుల్‌గా ‘విరాటపర్వం’ ఫస్ట్‌గ్లింప్స్‌

ఆరంభమే ముద్దులతో..

బాహుబలి కంటే గొప్పగా...