ఈ బైక్‌... చాలా కాస్ట్‌లీ గురూ..

16 Sep, 2019 09:34 IST|Sakshi

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు బీఆర్‌ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్‌ చౌరస్తా వరకు బైక్‌ రేసింగ్‌లపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. కేబీఆర్‌పార్కు చౌరస్తాలో బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాదరావు చేపట్టిన తనిఖీల్లో 10 బైక్‌లు మితిమీరిన వేగంతో దూసుకెళ్తూ పట్టుబడ్డారు. ఇందులో ఆరు స్పోర్ట్స్‌ బైక్స్‌ ఉన్నట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో ఇన్‌స్పెక్టర్‌ ముత్తు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి రేసింగ్‌లకు పాల్పడుతున్న 17 వాహనాలను సీజ్‌ చేశారు. ఇందులో ఒక కారుతో పాటు 16 బైక్‌లు ఉన్నాయి. తొమ్మిది స్పోర్ట్స్‌ బైక్స్‌ కావడం గమనార్హం. ఆదివారం జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో పంజగుట్ట ట్రాఫిక్‌ ఏసీపీ కోటేశ్వర్‌రావు వివరాలు వెల్లడించారు. మోటారు వాహనాల చట్టం  కింద రైడర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయా బైక్‌లపై నమోదైన కేసుల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైడింగ్‌కు పాల్పడ్డ వారిలో కొందరికి లైసెన్సులు లేవని మరికొన్నింటికి నంబర్‌ప్లేట్‌ లేదని ఇంకొన్ని మాడిఫైడ్‌ సైలెన్సర్లతో తిరుగుతున్నట్లు తెలిపారు. నిందితులకు బేగంపేటలో సోమవారం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా పట్టుబడిన వారిలో మలక్‌పేట, టోలిచౌకీ, హిమాయత్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన యువకులు ఉన్నట్లు తెలిపారు.

ఈ బైక్‌... చాలా కాస్ట్‌లీ గురూ
బంజారాహిల్స్‌: ఈ బైక్‌ ఖరీదు రూ.17 లక్షలు, 1300 సీసీ సామర్థ్యం, సింగిల్‌ సీట్, గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. లీటర్‌కు 5 కిలోమీటర్ల మైలేజీ, మాడిఫైడ్‌ సైలెన్సర్ల ఖరీదుకే రూ.1.50 లక్షలు, చెవులు దద్దరిల్లే శబ్ధం. జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు శనివారం అర్ధరాత్రి బైక్‌ రేసింగ్‌లపై చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా పట్టుకున్న ఈ బైక్‌ మలక్‌పేట్‌కు చెందిన యువ వ్యాపారి సమీర్‌ అహ్మద్‌దిగా గుర్తించి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహి ల్స్‌ రోడ్‌ నెం.2 కేబీఆర్‌ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు వారాంతాల్లో మాత్రమే సదరు యువకుడు ఈ బైక్‌ను బయటికి రేసింగ్‌లో పాల్గొంటాడు. ఒక్కసారి ఈ బైక్‌ రోడ్డెక్కిందంటే పెట్రోల్‌ కోసం రూ. 7 వేలు ఖర్చు చేయాల్సిందే. మోటారు వాహనాల చట్టానికి విరుద్దంగా రైడింగ్‌ చేస్తున్న ఈ బైక్‌ను జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హబ్సిగూడలో గ్యాంగ్‌ వార్‌

బాలికను అపహరించి, గొంతు కోసి..

వీరు మారరంతే..!

భార్య.. భర్త, ఓ స్నేహితుడు..

తమ్ముడిని కడతేర్చిన అన్న

కీచక ప్రొఫెసర్‌పై వర్సిటీ చర్యలు

ఘోర ప్రమాదం.. మహిళా, చిన్నారి మృతి

కన్నీరు మున్నీరు

నకిలీ బంగారంతో రూ.3.77 కోట్ల టోకరా

పాకిస్తాన్‌.. వాట్సాప్‌ గ్రూప్‌ హల్‌ చల్‌

భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్‌

వీసాల పేరిట రూ.3 కోట్లకు టోకరా  

రూ లక్ష కోసం కుమార్తెను అమ్మిన తల్లి

కారు చక్రాల కింద చితికిన చిన్నారి ప్రాణం..

భర్త ప్రియురాలిని పోలీసుల ముందే..

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్తత

కులాంతర వివాహానికి అడ్డు చెప్పారని..

ప్రాణం తీసిన అతివేగం

టీవీ చూడ్డానికి ఇంటికి వచ్చిన బాలికను..

రెచ్చిపోయిన పచ్చపార్టీ నేతలు.. ఎస్సైకి గాయం

సైకిల్‌ దొంగిలించాడని..

వదినను కొట్టొద్దు అన్నందుకు.. తమ్ముడి హత్య

దారికోసం ఇరువర్గాల ఘర్షణ

భార్య కాపురానికి రాలేదని.. ఆత్మహత్యాయత్నం

వైరల్‌ : నాగిని డాన్స్‌ చేస్తూ చనిపోయాడు

నర్సరావుపేటలో రియాల్టర్‌ దారుణ హత్య

టోల్‌ కట్టమన్నందుకు సిబ్బందిపై అమానుష దాడి

డోన్‌ ఎంవీఐ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

వివాహిత కిడ్నాప్, రోజూ గ్యాంగ్‌ రేప్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందుకేనేమో కాళ్లపై గాయాలు: ఇలియానా

శ్రీకాంత్‌కు వనమిత్ర అవార్డు

బాయ్‌ఫ్రెండ్‌ కోసం మూడో కన్ను తెరవనున్న నయన్‌

ఆడవాళ్లకు అనుమతి లేదు

చిన్న విరామం

ముచ్చటగా మూడోసారి