పెళ్లి కాకుండానే గర్భందాల్చిన యువతికి అబార్షన్‌..

3 May, 2019 06:27 IST|Sakshi
క్లినిక్‌ నిర్వాహకులతో మాట్లాడుతున్న డాక్టర్‌ చందు నాయక్‌

షాద్‌నగర్‌లో సాయి మైత్రి క్లినిక్‌ మూసివేత   

విచారణ చేపట్టిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ

షాద్‌నగర్‌టౌన్‌: పెళ్లి కాకుండానే గర్భందాల్చిన ఓ యువతికి ప్రైవేటు క్లినిక్‌లో వైద్యుడు అబార్షన్‌ చేసిన సంఘటన గురువారం ఉదయం షాద్‌నగర్‌ పట్టణంలో వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..  ఫరూఖ్‌నగర్‌ మండలం చించోడ్‌ గ్రామానికి చెందిన యువకుడు, కేశంపేటకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. అయితే యువతి పెళ్లికాకుండానే గర్భం దాల్చడంతో యువతి కుటుంబ సభ్యులు, ప్రియుడు షాద్‌నగర్‌ పట్టణంలోని రైల్వే స్టేషన్‌ రోడ్డులో ఉన్న సాయిమైత్రి పాలీ క్లినిక్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డిని ఆశ్రయించారు. గర్భందాల్చి మూడు నెలలు కావొస్తుందని, వెంటనే అబార్షన్‌ చేయాలని వైద్యుడు సూచించాడు. బుధవారం రాత్రి క్లినిక్‌లో నిబంధనలకువిరుద్ధంగా అబార్షన్‌ చేసిన సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ చందు నాయక్, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాసులు క్లినిక్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. అయితే అప్పటికి క్లినిక్‌లో డాక్టర్, ఆపరేషన్‌ చేయించుకున్న యువతి, వారి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడం గమనార్హం. క్లినిక్‌ నిర్వాహకులు, నర్సుల నుంచి అధికారులు వివరాలు సేకరించారు. 

సమగ్ర విచారణ చేపడుతాం:చందునాయక్‌
సాయి మైత్రి పాలీ క్లినిక్‌లో యువతికి అబార్షన్‌ చేసిన ఘటనపై సమగ్ర విచారణ చేపడుతామని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ చందు నాయక్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన క్లినిక్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. నిబంధనలకు ఉల్లంఘించిన వైద్యుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యుడు శ్రీనివాస్‌రెడ్డి యువతికి అబార్షన్‌ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. సాయి మిత్ర క్లినిక్‌ నిర్వహించేందుకు కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, గత రెండు నెలల క్రితం తనిఖీల చేసి క్లినిక్‌ నిర్వాహకులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్లబ్‌ డ్యాన్సర్‌ బట్టలు విప్పి అసభ్యకరంగా..

సెప్టిక్‌ట్యాంక్‌లో పడి ఏడుగురు మృతి

తాంత్రికుడి కోరిక తీర్చలేదని భార్యను..

కడుపు కోసి బిడ్డను తీసి ఆ పై....

కనిపించకుండా పోయిన బాలుడు శవమై తేలాడు

పేరుమోసిన రౌడీషీటర్ ఎన్‌కౌంటర్

ఆకాశవాణిలో దొంగలు పడ్డారు

పెళ్లి చేసుకోవాలంటూ యువతిపై దాడి

కష్టాలు భరించలేక భర్తను కడతేర్చిన భార్య

ఎయిర్‌పోర్ట్ ఉద్యోగిని పట్ల అసభ్య ప్రవర్తన

నడిరోడ్డుపై మహిళను తంతూ..

రెప్పపాటులో ఘోరం..

మీటూ : నటుడిపై లైంగిక వేధింపుల కేసు

రంజీ క్రికెటర్‌ను మోసగించిన కోడెల కుమారుడు

ప్రైవేటు కాలేజీలో చేర్పించలేదని..

నెక్లెస్‌ రోడ్డు ఘటన.. యువకుడు మృతి

కొద్ది రోజుల్లో పెళ్లి..కానీ అంతలోనే

పెళ్లయి ఏడేళ్లు గడిచినా..

తల్లీ, కూతురు అదృశ్యం

పెళ్లి చేసుకో లేదంటే.. నీ తల్లిదండ్రులు చనిపోతారు!

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి 

దేవుడంటే భయం..హుండీలంటే ఇష్టం

ప్రైవేటు ఉపాధ్యాయురాలిపై ఉన్మాది కాల్పులు

మతం ముసుగులో మోసం

స్నేహగీతంలో మృత్యురాగం

ఢీ కొట్టిన వాహనం.. కానిస్టేబుల్‌ మృతి

అర్ధరాత్రి ఎగసిన అగ్నికీలలు

జార్ఖండ్‌లో మావోల పంజా

మావోయిస్టుల ఘాతుకం.. ఐదుగురి మృతి

చిరంజీవి చిన్నల్లుడి కేసులో పురోగతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షూటింగ్ మొదలైన రోజే వివాదం!

విజయ్‌సేతుపతితో అమలాపాల్‌!

గ్లామర్‌నే నమ్ముకుంటుందా?

టాలెంట్‌ ఉంటే దాచుకోవద్దు

మీటూ : నటుడిపై లైంగిక వేధింపుల కేసు

గాయకుడు రఘు, డ్యాన్సర్‌ మయూరి విడాకులు