వివాహేతర సంబంధం.. యువకుడిని ముక్కలుగా చేసి..

10 Feb, 2019 11:47 IST|Sakshi
వంశీ (ఫైల్‌)

కేవీబీపురం: యువకుడు దారుణహత్యకు గురైన ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పుత్తూరు డీఎస్‌పీ సౌమ్యలత కథనం..మండలంలోని దిగువపూడి గ్రామానికి చెందిన గోవిందరాజులు, మునిచంద్రమ్మల రెండో కుమారుడు వంశీ(19) త్రివేణి క్రషర్‌లో జేసీబీ ఆ పరేటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం కట్టెల కోసమని అడవికి వెళ్లిన వంశీ ఇంటికి రాకపోవడంతో అతని కోసం గాలించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో  దుర్వాసన వస్తుండడంతో అక్కడికెళ్లి చూడగా తల, కాలు, చెయ్యిలేని మొండెం కనిపిం చడంతో హడలిపోయారు.

అక్కడ లభించిన సెల్‌ఫోన్, మొలతాడు ఆధారంగా మృతదేహం వంశీదిగా గుర్తించారు. సమాచారం అందుకున్న   పుత్తూరు డీఎస్‌పీ సౌమ్యలత, సీఐ దైవప్రసాద్, నారాయణవనం ఎస్‌ఐ దస్తగిరి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వంశీ తల కోసం స్థానికులు సుమారు ఐదుగంటలపాటు గాలించారు. చివరకు మొండెం ఉన్న ప్రదేశానికి సుమారు 40 మీటర్ల దూరంలో లుంగీలో కట్టి, పూడ్చిపెట్టిన తలను పోలీసులు వెలికితీసారు. మృతదేహం తీరును బట్టి రెండురోజుల క్రితం హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని అతికష్టం మీద అటవీ ప్రాంతం నుంచి గ్రామానికి, అక్కడి నుంచి పంచనామా నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. హతుడి తల్లి ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివాహేతర సంబంధమే  హత్యకు కారణమా?
అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వంశీ వివాహేతర సంబంధం కలిగి ఉండడంతో దారుణంగా హతమార్చారని హతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని క్లూస్‌ టీం,డాగ్‌ స్క్వాడ్‌ పరిశీలించాయి. హత్యకు కారణాలేమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు