బ్లాక్‌మనీ నెట్‌వర్క్‌ గుట్టురట్టు

25 Mar, 2018 16:48 IST|Sakshi

సాక్షి, లక్నో : నల్ల ధనాన్ని సరఫరా చేస్తున్న ముఠా గుట్టును యూపీ పోలీసుకు చెందిన ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్‌) రట్టు చేసింది. పాకిస్తాన్‌తో సంబంధాలున్న ఈ కేసులో పది మందిని అరెస్ట్‌ చేసినట్టు ఉత్తర్‌ ప్రదేశ్‌ ఏటీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అసిం అరుణ్‌ పేర్కొన్నారు. పాకిస్తాన్‌లోని కొందరు యూపీ, మధ్యప్రదేశ్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులతో సంబంధాలు నెరుపుతున్నారని, వారితో నకిలీ గుర్తింపు పత్రాలతో బ్యాంక్‌ ఖాతాలు తెరవాలని చెప్పారని ఆయన వెల్లడించారు.

నకిలీ పత్రాలతో తెరిచిన బ్యాంకు ఖాతాల ద్వారా రూ 10 కోట్ల లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఈ ఖాతాల్లోకి నేపాల్‌, పాకిస్తాన్‌, ఖతార్‌ల నుంచి డబ్బులు డిపాజిట్‌ అయ్యాయని చెప్పారు. పీఎన్‌బీ స్కామ్‌తో సహా పలు రుణాల ఎగవేత కేసులతో దేశ బ్యాంకింగ్‌ వ్యవస్ధ కుదేలైన క్రమంలో ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం.

మరిన్ని వార్తలు