అడ్డదారుల్లో అనుమతులిచ్చారు

27 Mar, 2018 12:27 IST|Sakshi
భూమి పత్రాలు   చూపిస్తున్న రోహిణి 

జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై ఎన్‌ఆర్‌ఐ మండిపాటు

విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడి

బంజారాహిల్స్‌: జీహెచ్‌ఎంసీ ఒరిజినల్‌ లేఅవుట్‌లో చూపించిన విధంగా కాకుండా కొందరు బడాబాబులకు తలొగ్గిన అధికారులు, సొసైటీ ప్రతినిదులు తమ ప్లాట్‌ను మార్చేసి అన్యాయం చేస్తున్నారని యూకేకి చెందిన ఎన్‌ఆర్‌ఐ గొట్టిపాటి రోహిణి ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో సోమవారం తనకు జరిగిన అన్యాయాన్ని విలేకరులకు వివరించారు.
 

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.86లో జూబ్లీహిల్స్‌ సొసైటీ ద్వారా తనకు కేటాయించిన 469–డి ప్లాట్‌కు ఆనుకొని ఉన్న సొసైటీకి చెందిన అదనపు స్థలాన్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పడంతో తాను రూ.75 లక్షల బ్యాంకు పూచీకత్తును సొసైటీకి ఇచ్చానన్నారు.ప్రారంభంలో తన ప్లాట్‌ను ఆనుకొని ఉన్న అదనపు స్థలాన్ని తమకే క్రమబద్ధీకరిస్తామని చెప్పినా ఇప్పటిదాకా చేయలేదన్నారు.
 

ఇదే విషయంపై తాను 11 నెలలుగా జీహెచ్‌ఎంసీ, పోలీసులు, రెవెన్యూ, సొసైటీ అధికారుల చుట్టూ తిరుగుతున్నానని పేర్కొన్నారు. ఇటీవల తమ ప్లాట్‌ పక్కనే ఉన్న 469–సి ప్లాట్‌కు చెందిన డైమన్షన్‌ మార్చేసి తమ అధీనంలో ఉన్న స్థలంలోకి జరిపి జీహెచ్‌ఎంసీ అడ్డదారుల్లో అనుమతులు మంజూరు చేసిందని ఆరోపించారు.  జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై విదేశాంగ శాఖకు, మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చే యనున్నట్లు రోహిణి స్పష్టం చేశారు.  
 

మరిన్ని వార్తలు