భారత సంతతి యువ వైద్యురాలు అదృశ్యం

5 Mar, 2019 20:40 IST|Sakshi
అదృశ్యమైన యువ వైద్యురాలు ప్రీతిరెడ్డి(పాత చిత్రం)

మెల్‌బోర్న్‌: భారత సంతతికి చెందిన ఓ యువ వైద్యురాలు  సిడ్నీలో అదృశ్యమైంది. అదృశ్యమైన వైద్యురాలు ప్రీతిరెడ్డి(32) ఆస్ట్రేలియాలో డెంటిస్ట్‌గా పనిచేస్తోంది. గత ఆదివారం వేకువజామున 2.15 గంటలకు జార్జ్‌ స్ట్రీట్‌లో ఉన్న మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్‌ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో ఆమె దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రీతి రెడ్డి అదృశ్యంపై విచారణ జరుగుతోందని న్యూసౌత్‌వేల్స్‌ పోలీసులు తెలిపారు. ఆమె గురించి ఎలాంటి సమాచారం తెలిసినా తమకు తెలియజేయాలని స్థానిక పోలీసులు, స్నేహితులను సన్నిహితులను కోరారు.  చివరి సారి ప్రీతిరెడ్డి తన కుటుంబసభ్యులతో గత ఆదివారం ఉదయం 11 గంటలకు మాట్లాడినట్లు తెలిసింది. ప్రీతిరెడ్డి అదృశ్యంతో కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు.

మరిన్ని వార్తలు