విడాకులు కోరినందుకు భార్యను...

16 Jul, 2019 20:10 IST|Sakshi

న్యూయార్క్‌ : విడాకులు కోరిన భార్యను దారుణంగా హతమార్చిన భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆగస్టు 23న అతడికి శిక్ష ఖరారు చేయనుంది. వివరాలు... భారత్‌కు చెందిన అవతార్‌ గ్రెవాల్‌(44), నవనీత్‌ కౌర్‌లకు 2005లో వివాహం జరిగింది. ఉద్యోగ కారణాల రీత్యా పెళ్లైన కొన్ని రోజుల తర్వాత అవతార్ కెనడాకు వెళ్లగా, నవనీత్‌ అమెరికాకు వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో రెండేళ్ల తర్వాత భర్త నుంచి విడిపోవాలని నవనీత్‌ నిర్ణయించుకుంది. కానీ అవతార్‌ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు.

కాగా ఈ విషయం గురించి అవతార్‌ను ఒప్పిం‍చేందుకు తన ఇంటికి రావాల్సిందిగా నవనీత్‌ అతడిని కోరింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు వచ్చి మరీ అతడిని రిసీవ్‌ చేసుకుంది. ఇంటికి వెళ్లిన తర్వాత విడాకుల విషయమై ఇద్దరు చర్చిస్తున్న సమయంలో కోపోద్రిక్తుడైన అవతార్‌.. నవనీత్‌పై దాడి చేశాడు. తర్వాత ఆమెను బాత్‌టబ్‌లో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి కెనడాకు పారిపోయాడు. ఈ క్రమంలో నవనీత్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అమెరికాకు తీసుకువచ్చి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం కోర్టు అవతార్‌ను దోషిగా తేల్చింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

150 మంది చిన్నారులకు విముక్తి​

స్కూల్‌లో పిల్లలు కూర్చోబోతుండగా కరెంట్‌ షాక్‌

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’