డేట్‌కు వెళ్లి హత్యకు గురైన భారత విద్యార్థి

25 Jul, 2018 20:38 IST|Sakshi

మెల్‌బోర్న్ : డేటింగ్‌ సైట్లో పరిచయమైన అమ్మాయిని కలిసేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. 25 ఏళ్ల మాలిన్‌ రాథోడ్‌ ఆస్ట్రేలియాలో అకౌంట్స్‌ విద్యను అభ్యసిస్తున్నాడు. మెల్‌బోర్న్‌లోని మెల్‌బోర్న్‌లోని సన్‌బరీ సబర్బ్ ప్రాంతంలో ఉన్న అమ్మాయిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే, ఏం జరిగిందో ఏమోగానీ రాథోడ్‌ తీవ్ర గాయాలతో ఆమె ఇంట్లో పడివున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఆస్ట్రేలియా పోలీసులు రాథోడ్‌ను ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే రాథోడ్‌ ప్రాణాలు విడిచాడు. సదరు అమ్మాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరపర్చారు. జడ్జి తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. రాథోడ్‌ మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

మరిన్ని వార్తలు