అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్టు

3 Nov, 2018 07:51 IST|Sakshi
రావులపాలెం పోలీస్‌స్టేషన్‌లో నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ పెద్దిరాజు, పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు

నలుగురిని అరెస్టు చేసిన రావులపాలెం పోలీసులు

రూ.తొమ్మిది లక్షల విలువైన 404 గ్రాముల బంగారు ఆభరణాలు, మోటారు బైక్‌ స్వాధీనం

వెల్లడించిన రావులపాలెం సీఐ పెద్దిరాజు

తూర్పుగోదావరి, రావులపాలెం (కొత్తపేట): ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు కేసుల్లో నిందితులు, అంతర్‌ జిల్లాల దొంగలు నలుగురిని రావులపాలెం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.తొమ్మిది లక్షల విలువైన 404.54 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక మోటరు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పెద్దిరాజు వారి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గతంలో పలు కేసులు నమోదు కాబడిన నిందితులు మలికిపురం మండలం గుడిమెళ్లంకకు చెందిన మామిడి శెట్టి సురేష్, భీమవరం మండలం గునిపూడికి చెందిన పందిరి వెంకట నారాయణ, సఖినేటిపల్లి మండలం అంతర్వేదికి చెందిన జిళ్లెళ్ల రాకేష్, గతనెల 15వ తేదీన మండలంలోని వెదిరేశ్వరంలో ఒక ఇంటిలో దొంగతనం చేశారు.

ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా నిందితులు దొంగిలించిన నగదును మార్చేందుకు తణుకు నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న సీఐ పెద్దిరాజు వచ్చిన సమాచారంతో శుక్రవారం రావులపాలెం ఎస్సై సీహెచ్‌ విద్యాసాగర్, సిబ్బంది మండలంలోని ఈతకోట చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీ చేస్తుండగా దొంగలించిన మోటరు సైకిల్‌పై నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో వీరిని విచారించగా, చోరీ సొత్తును మారకం చేసేందుకు సహకరించిన తణుకు మండలం వేల్పూరుకు చెందిన ఒబినీడి సాయికృష్ణ కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నాలుగు కేసుల్లో రెండు రావులపాలెం మండల పరిధిలోనివి కాగా మిగిలిన రెండు అమలాపురం రూరల్‌ పరిధిలో నమోదైన  కేసులు, నాలుగు కేసుల్లో సుమారు రూ.తొమ్మిది లక్షల విలువైన 404.54 గ్రాముల బంగా>రు ఆభరణాలు, మోటరు సైకిల్‌ను స్వా«ధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. వీరిపై ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాలో కూడా పలు కేసులు నమోదైనట్టు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కొత్తపేట జేఎఫ్‌సీఎం కోర్టులో హజరుపర్చనున్నట్టు తెలిపారు. దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన ఎస్సై విద్యాసాగర్‌ను, పీఎస్సై దుర్గాప్రసాద్, ఏఎస్సై ఆర్‌వీరెడ్డి, హెచ్‌సీలు పి.అమ్మిరాజు, దుర్గారావు, బ్రహ్మాజీ, రమణ, కానిస్టేబుళ్లు చక్రవర్తి, గీతాకృష్ణ, కృష్ణ, సతీష్, తదితరులను సీఐ అభినందించారు.

మరిన్ని వార్తలు