చదువు విషయంలో మనోవేదన

5 Jan, 2018 09:43 IST|Sakshi

తనువు చాలించిన ఇంటర్‌ విద్యార్థి 

యాలాల(తాండూరు): చదువు విషయంలో మనస్తాపం చెందిన ఓ ఇంటర్‌ విద్యార్థి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని అక్కంపల్లిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మడిగె రాములు, అమృతమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రాములు ఇటీవల నగరానికి వలస వెళ్లాడు. వీరి పెద్ద కొడుకు అనిల్‌(17) తాండూరులోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. గురువారం సాయంత్రం అనిల్‌ తమ పొలంలో పురుగులమందు తాగి ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబీకులకు సమాచారం ఇచ్చి అనిల్‌ను చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. చదువు విషయంలో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని విద్యార్థి తల్లి అమృతమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. 

మరిన్ని వార్తలు