తల్లిదండ్రులు మందలించారని..

28 Oct, 2018 15:38 IST|Sakshi

జంగారెడ్డిగూడెం: తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఇంటర్‌ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం పట్టేన్నపాలంలో కలకలం రేపింది.  జంగారెడ్డిగూడెంలోని వెంకటేశ్వర కళాశాలలో ఇంటర్‌ రెండో ఏడాది చదువుతున్న పోకల నాగ దుర్గా ప్రసాద్‌(18) బలవన్మరణానికి పాల్పడ్డాడు. చదవు విషయంలో తల్లిదండ్రులు మందలించడంతో శనివారం సాయంత్రం స్థానిక ఆర్టిఏ కార్యాలయం సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుని తండ్రి తెలిపిన వివరాల ప‍్రకారం.. తమది నిరుపేద కుటుంబం అని, తన కుమారుడు ఇంటర్మీడియట్‌లో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడని పేర్కొన్నాడు. గతంలో కంటి ఆపరేషన్‌ జరగడంతో అప్పటి నుండి ఒక కంటికి దృష్టిలోపం ఏర‍్పడి చదువులో వెంకబడ్డాడని దానితో మొదటి సంవత్సరం సబ్జెక్ట్‌లకు సంబంధించి మూడు సబ్జెక్టులు వరకు పాస్ అవ్వాల్సి ఉందని తెలిపాడు. ఈ క్రమంలోనే రెండో సంవత్సరం సరిగా చదవటం లేదని కళాశాల యాజమాన్యం తెలియజేయడంతో తన కుమారుడ్ని పిలిచి చదువుకోక పోతే ఇబ్బంది పడాల్సివస్తుందని చెప్పానన్నాడు. తన ఆవేదనను అర్ధం చేసుకోలేని కుమారుడు పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్నాడని విలిపించాడు. ఈ కేసును అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు