ఇంటర్‌ పరీక్షలు..యువతి ఆత్మహత్యాయత్నం..!

27 Feb, 2019 14:38 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ అర్బన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు నేడు (బుధవారం) మొదయ్యాయి. ఎలాంటి అక్రమాలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎగ్జామ్‌ సెంటర్లలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అయితే, హన్మకొండలోని నయీంనగర్‌లో గల ఆర్‌డీ కళాశాలలో ఒక విద్యార్థిని కాపీయింగ్‌కు పాల్పడుతుండగా.. కాలేజీ సిబ్బంది గుర్తించారు. దీంతో అవమాన భారానికి గురైన పోలసాని రక్షరావు (16) కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. తీవ్ర గాయాలపాలైన రక్షను ఆస్పత్రికి తరలించారు. (తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం)

తెలంగాణలో 9లక్షల 42వేల 719 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు సిద్ధమయ్యారు. తెలంగాణ బోర్డు తమ విద్యార్థుల కోసం 1277 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. తెలంగాణలో 32సమస్యాత్మక కేంద్రాలున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఉదయం 8 గంటల 45 నిమిషాల్లోగా పరీక్ష హాల్లోకి చేరుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు. 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు