హైటెక్‌ మోసగాళ్ల గుట్టురట్టు

12 Sep, 2018 21:01 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడలో టూటౌన్‌ పోలీసులు హైటెక్‌ మోసాన్ని గుట్టురట్టు చేశారు. బుధవారం ట్రాయ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్నేషన్‌ కాల్స్‌ను డైవర్ట్‌ చేస్తోన్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదర్ల గణేష్‌, గుమశ్రీకొండ రామదాసు, బుస్సా శ్రీధర్‌, ఉలవల ముసలయ్య అనే వ్యక్తులు చైనాకు చెందిన స్కైన్‌ నెట్‌ అనే సంస్థతో ఓ ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం సిమ్‌ క్యారియర్‌ల ద్వారా ఇంటర్నేషనల్‌ కాల్స్‌ డైవర్ట్‌ చేస్తూ భారత టెలికాం ఆదాయానికి గండికొట్టసాగారు.

అంతేకాకుండా వారు హైదరాబాద్‌లోనూ కాల్స్‌ డైవర్ట్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారినుంచి పది లక్షల విలువైన సిమ్‌ క్యారియర్‌లు, ఇన్వర్టర్లు, వివిధ కంపెనీలకు చెందిన 800 సిమ్‌ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు