నీరవ్‌కు మరో దెబ్బ, నేహాల్‌పై రెడ్‌ కార్నర్‌ నోటీసు

13 Sep, 2019 11:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్‌ కుంభకోణంగా నిలిచిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్కాం విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎన్‌బీ స్కాంలో ప్రధాన నిందితుడు, డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌  డైరెక్టరేట్‌ షాకిచ్చింది. ఇప్పటికే నీరవ్‌ సోదరి పూర్వి మోదీ మెహతాపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ కాగా తాజాగా సోదరుడు  నేహాల్‌ దీపక్‌ మోదీ(40) పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయ్యింది.  ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్‌ పోల్‌ ఈ నోటీసు జారీ చేసింది.

నీరవ్ విదేశాలకు పారిపోవడంలో నేహాల్ పాత్రకీలకమైందని ఆరోపిస్తూ అతనిపై రెడ్ కార్నర్‌ నోటీసు జారీ చేయాలని ఈడీ ఇటీవల ఇంటర్‌ పోల్‌ను అభ్యర్థించింది.మనీలాండరింగ్, సాక్ష్యాలను నాశనం చేసేందుకు, నేహాల్‌ ఉద్దేశపూర్వకంగా సహాయపడ్డాడని ఈడీ ఆరోపించింది. కాగా ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌బ్యాంకులో ఎల్‌ఓయుల ద్వారా రూ.13వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌  విదేశాలకు చెక్కేశాడు.  దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఇప్పటికే నీరవ్‌ కేసులు నమోదు చేయడంతో పాటు పలు ఆస్తులను ఎటాచ్‌ చేశాయి. అటు నీరవ్‌ పాస్‌పోర్ట్‌ను రద్దు చేసిన  కేంద్రప్రభుత‍్వం ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది.  అతనిని తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నీరవ్ ప్రస్తుతం లండన్‌ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు