'ట్రంప్‌ ఓ కుక్క.. ఇక మీపై బాంబుల వర్షమే..'

14 Dec, 2017 18:22 IST|Sakshi

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా ప్రకటించడంపై ఓ పక్క ముస్లిం దేశాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుండగా ఏకంగా అమెరికాపై బాంబులు వేస్తామంటూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ హెచ్చరించింది. అమెరికాపై వరుస దాడులకు పాల్పడతామంటూ వార్నింగ్‌ ఇచ్చింది. అంతకంటే ఎక్కువ వివరాలు మాత్రం తెలియజేయలేదు. జెరూసలేంను ట్రంప్‌ ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తున్నామని చెప్పిన విషయం తెలిసిందే.

అయితే, ఆ నిర్ణయంపై అటు పాలస్తీనీయన్లతోపాటు ఇతర ముస్లిం దేశాల వాళ్లు యురోపియన్‌ దేశాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తాజాగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఓ టెలిగ్రాం విడుదల చేసింది. 'మాకోసం ఎదురు చూడండి. ఇస్లామిక్‌ స్టేట్‌ ఇప్పుడు మన్‌హట్టన్‌లో ఉంది' అంటూ అందులో పేర్కొంది. 'ఇరాక్‌, యెమెన్‌, లిబియా, సిరియా, అస్ఘనిస్థాన్‌లో మీరు ఎలాంటి విధ్వంసం సృష్టించారో అదే మేం చేయనున్నాం. కాస్త ఎదురుచూడండి. మీ కుక్క(డోనాల్డ్‌ ట్రంప్‌) జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తించాడు. అందుకే మీ రాజధానిపై బాంబులు కురిపించి మేం గుర్తింపునిస్తాం' అంటూ హెచ్చరించింది.  

మరిన్ని వార్తలు