ముద్దు ఎంత పని చేసింది...

21 Feb, 2019 10:15 IST|Sakshi

చెన్నై ‌: ప్రియురాలు సవాల్‌ విసిరింది. అలాంటి ఇలాంటి ఛాలెంజ్‌ కాదు. తాను చెప్పినట్లు వస్తే ముద్దు ఇస్తానంటూ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఇంకేముంది... ప్రేయసి ముద్దు కోసం ప్రియుడు సై అన్నాడు. అమ్మడు చెప్పినట్లే  సిద్ధమై అతగాడు ఆశగా ముద్దు కోసం వచ్చాడు. తీరా అయ్యగారి వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్నట్లు... ఆ యువకుడు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపెట్టాడు. ఈ సందర్భంగా చెన్నైలోని రాయపేటలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని పట్టాభిరామ్‌ తండురై గ్రామం పల్లవీధికి చెందిన శక్తివేల్‌ (22) అన్నాసాలైలోని ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఐసీఐసీఐ బ్యాంక్‌ ట్రస్ట్‌ తరఫున ఉద్యోగ శిక్షణలో ఉండగా అక్కడే ఉన్న ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆమెను ప్రేమికుల రోజున ముద్దు ఇవ్వమని అడగగా అందుకు అంగీకరించలేదు. ముద్దు కావాలంటే బురఖా ధరించి రాయపేట నుంచి మెరీనా బీచ్‌ వరకు రావాలని పందెం కాసింది. అలా చేస్తే ముద్దు ఇస్తానని చెప్పడంతో శక్తివేల్‌ బురఖా వేసుకుని ప్రియురాలి ఇంటికి వచ్చిన అతడు.. ఆ తర్వాత ఆమెతో మెరీనా బీచ్‌కు వెళ్లాడు. అయితే శక్తివేలు నడకతో పాటు, కాళ్లకు మగవాళ్ల ధరించే స్లిప్పర్స్, వీటితో పాటు అయ్యగారు వ్యవహారం తేడాగా ఉండటంతో... అనుమానం వచ్చిన స్థానికులు అతడిని పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. పోలీసులు శక్తివేల్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు