జైన సాధువు తరుణ్‌ సాగర్‌ కన్నుమూత

1 Sep, 2018 12:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ జైన సాధువు తరుణ్‌ సాగర్‌(51) శనివారం ఉదమం కన్నుముశారు. గత కొంత కాలంగా కామెర్లు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన  ఢిల్లీలోని రాధాపురి జైన ఆలయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 

అనారోగ్యం కారణంగా ఆయన కొద్ది రోజుల క్రితం హాస్పిటల్లో చేరారు. ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో మందులు తీసుకోవడం మానేశారు. సల్లేఖిని వ్రతం స్వీకరించి (ఆహారం ముట్టుకోకుండా ఉండడం) ఆయన ప్రాణత్యాగం చేశారని తెలుస్తోంది. 

ఆయన మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి బాధను కలిగిస్తుందన్నారు. సమాజానికి తరుణ్ సాగర్ చేసిన బోధనలు మర్చిపోలేమని వ్యాఖ్యానించారు.  తరుణ్ సాగర్ జీ మహారాజ్ బోధనలు ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తున్నాయని ప్రధాని ట్వీట్‌ చేశారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్,  సురేశ్ ప్రభు,, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ,  హర్యానా సీఎం ఖట్టర్ తదితరులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

1967 జూన్ 26న మధ్యప్రదేశ్‌లోని దమోహ్‌ జిల్లాలో  తరుణ్ సాగర్ జన్మించారు. ఆయన అసలు పేరు పవన్ కుమార్ జైన్. 13వ ఏటే ఆయన సన్యాస దీక్ష స్వీకరించారు. ‘కడ్వే ప్రవచన్’  పేరిట ఆయన ఇచ్చే ప్రసంగాలు ప్రాచుర్యం పొందాయి. హర్యానా అసెంబ్లీలో ప్రసంగించడానికి ఆహ్వానం రావడంతో ఆయన పేరు వార్తల్లో నిలిచింది. ఆయన ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోతుండటం, పాకిస్థాన్ వ్యవహార శైలి, రాజకీయ నాయకుల గురించి మాట్లాడారు. రేపిస్ట్ బాబాలను ఒసామా బిన్‌ లాడెన్‌తో పోల్చారు.

మరిన్ని వార్తలు