ఏసీపీ కార్యాలయానికి శిఖా చౌదరి

14 Feb, 2019 13:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై, వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్యకేసులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిందితులు రాకేష్ రెడ్డి‌, శ్రీనివాస్‌లను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న జయరాం మేనకోడలు శిఖా చౌదరిని కూడా గురువారం పోలీసులు విచారించనున్నారు. ఈ మేరకు ఏసీపీ కార్యాలయంలో విచారణ కొనసాగనుంది. కాగా మొదటి రోజు విచారణలో భాగంగా ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న 30 మందిని పోలీసులు విచారించారు. ఇందులో భాగంగా సినీ నటుడు, కమెడియన్‌ సూర్య ప్రసాద్‌ అలియాస్‌ డుంబును కూడా విచారించినట్లు తెలుస్తోంది. (జయరాం హత్య కేసులో సంచలన నిజాలు...)

సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్న పోలీసులు
జయరాం హత్యకు ముందు రాకేష్‌ రెడ్డి రోజు జరిపిన కాల్‌ లిస్టు ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన నాడు రాకేష్‌రెడ్డి ఇంట్లో జరిగిన సీన్‌ను రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. కాగా ఈ విచారణలో సీసీ కెమెరాలు కీలకంగా మారనున్నాయి. ఇక ఈ కేసులో శిఖా చౌదరి పాత్రపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపనున్నారు.

మరిన్ని వార్తలు