అవాక్కు.. ఫ్లైట్‌ ఉద్యోగిని బ్యాగులో రూ.3.21కోట్లు

9 Jan, 2018 11:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జెట్‌ ఎయిర్‌వేస్‌ మహిళా ఉద్యోగినిని ఢిల్లీ అధికారులు అరెస్టు చేశారు. అక్రమంగా రూ.మూడు కోట్ల విలువైన అమెరికా డాలర్లను పట్టుకెళుతున్న ఆమెను ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. హాంకాంగ్‌కు చెందిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానం సోమవారం రాత్రి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. డీఆర్‌ఐ అధికారులు ఆ సమయంలో తనిఖీ చేయగా జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బందిలోని ఒకరి వద్ద ఉన్న సూట్‌ కేసులో రూ.3.21కోట్ల విలువైన అమెరికన్‌ డాలర్లు లభించాయి. దీంతో ఆమెను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

మరిన్ని వార్తలు