టీచకుడికి రిమాండ్‌

2 Feb, 2018 11:23 IST|Sakshi
ప్రొఫెసర్‌ బాబులును సబ్‌జైలుకు తరలిస్తున్న పోలీసులు

జేఎన్‌టీయూకే ప్రొఫెసర్‌ బాబులుపై నిర్భయ కేసు

15రోజుల రిమాండ్‌కు తరలింపు

బాలాజీచెరువు(కాకినాడసిటీ), కాకినాడ లీగల్‌: జేఎన్‌టీయూకేలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఐఎస్‌టీ డైరెక్టర్, ప్రొఫెసర్‌ కె.బాబులుపై నిర్భయ చట్టం ప్రకారం సర్పవరం పోలీసులు కేసు నమోదుచేశారు. కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు ఈ నెల 15 వరకు రిమాండ్‌ విధిస్తూ మేజిస్ట్రేట్‌ కంటిపూడి శ్రీహరి ఆదేశాలు జారీచేశారు. దీంతో పోలీసులు ప్రొఫెసర్‌ బాబులును కాకినాడ సబ్‌జైలుకు తరలించారు.

విచారణలో పలు విషయాలు వెలుగులోకి..
మరోవైపు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ సుబ్బారావు ఫిర్యాదు మేరకు ప్రొఫెసర్‌బాబులుపై నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు తమ విచారణను కొనసాగించారు. ఎంటెక్‌ విద్యార్థినులతో మాట్లాడారు. అయితే ఈ విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్టు గురువారం సాయంత్రం సర్పవరం సీఐ చైతన్యకృష్ణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రొఫెసర్‌ బాబులు వైవాను ప్రత్యేకంగా తన ఛాంబర్‌లో సాయంత్రం 5.30 నిముషాల వరకు నిర్వహించారని, అలాగే మొబైల్‌ నంబర్లకు మిస్డ్‌ కాల్స్‌ ఇచ్చారని తెలిసిందన్నారు. 

మరిన్ని వార్తలు