కోర్టులో ఏడ్చేసిన మహిళా డాక్టర్లు

31 May, 2019 20:58 IST|Sakshi
నిందితురాలు హేమ అహుజా... మృతురాలు పాయల్‌ తాడ్వీ (ఫైల్‌)

ముంబై: కులం పేరుతో దూషించడంతో ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలి కేసులో ముగ్గురు మహిళా డాక్టర్లకు ముంబై ప్రత్యేక కోర్టు జూన్‌ 10 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. స్థానిక బీవైఎల్‌ నాయర్‌ ఆస్పత్రిలో వైద్య విద్యలో పీజీ చదువుతున్న పాయల్‌ తాడ్వీ సీనియర్లయిన ముగ్గురు మహిళా డాక్టర్లు కులం పేరుతో వేధించడంతో ఈనెల 22న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో అంకితా ఖండేల్వాల్, హేమ అహుజా, భక్తి మహెరేలను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. నిందితురాళ్లకు విధించిన పోలీస్‌ కస్టడీని పొడిగించాలని వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ ఆదేశాల్చింది. కోర్టు నిర్ణయంతో నిందితురాళ్లు కన్నీరు పెట్టుకున్నారు. బెయిల్‌ కోసం సోమవారం కోర్టులో వీరు పిటిషన్‌ వేయనున్నారు.

కాగా, డాక్టర్‌ పాయల్‌ తాడ్వీ ఆత్మహత్య కేసులో నిందితురాళ్లపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని భక్తి మహెరే తల్లి అన్నారు. పాయల్‌ తాడ్వీపై ఎటువం‍టి వేధింపులకు పాల్పడలేదని తెలిపారు. ఈ కేసులో అరెస్టైన ముగ్గురు మహిళా డాక్టర్లు నిరపరాధులని, వీరికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: ఈ పాపం ఎవరిది?)

మరిన్ని వార్తలు