జ్యోతిని హతమార్చింది ప్రియుడే

15 Feb, 2019 17:11 IST|Sakshi

గుంటూరు: సంచలనం సృష్టించిన రాజధానిలో ‘జ్యోతి హత్య’ కేసులో ఆమె కుటుంబసభ్యులు ఊహించిందే జరిగింది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియురాలిని ప్రియుడు శ్రీనివాస్‌ హత్య చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. గత కొంతకాలంగా తనను వివాహం చేసుకోవాలని జ‍్యోతి ఒత్తిడి తేవడంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవడానికి ప్రియుడు క్రైమ్‌ సినిమాను తలపించేలా పక్కా స్కెచ్‌ వేసినా ఫలితం లేకపోయింది. పోలీసు దర్యాప్తు ముందు నిందితుడు తలవంచక తప్పలేదు.

మంగళగిరి మండలం నవులూరు సమీపంలో అమరావతి టౌన్‌ షిప్‌లో ఈ నెల 11వ తేదీ రాత్రి ప్రేమ జంటపై గుర్తు తెలియని అగంతకులు దాడి చేసిన ఘటనలో అంగడి జ్యోతి (25) అక్కడికక్కడే మృతిచెందగా, ప్రియుడు శ్రీనివాసరావు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దాడికి పాల్పడింది ఎవరనే విషయం మిస్టరీగా మారినప్పటికీ పోలీసులు ఎట్టకేలకు నిందితుడెవరనేది చేధించారు. పోలీసు దర్యాప్తులో జ్యోతిని హత్య చేసింది ఆమె ప్రియుడు చుంచు శ్రీనివాసరావేనని తేల్చారు. ప్రియుడు శ్రీనివాస్‌ తన స్నేహితులతో కలిసి జ్యోతిని హతమార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. జ్యోతిని హత్య చేసేందుకే ఇంట్లో నుంచి పిలిపించేందుకు శ్రీనివాస్‌ ఒక యువతితో పదేపదే ఫోన్లు చేయించాడని పోలీసులు తెలిపారు.

చాలా రోజులుగా పెళ్లి చేసుకోవాలంటూ శ్రీనివాస్‌పై జ్యోతి ఒత్తిడి తేవడంతో పథకం ప్రకారం అంతమొందించాలని ప్రయత్నించాడని పోలీసులు చెప్పారు. జ్యోతితో శ్రీనివాస్‌కు పెళ్లి ఇష్టం లేకే మర్డర్‌ ప్లాన్‌ అమలు పరిచాడని పేర్కొన్నారు. నిందితుడి కాల్‌డేటా ద్వారా కేసును చేధించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా భద్రత పెంచారు. మొదటి నుంచి శ్రీనివాస్‌పైనే జ్యోతి కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులపై కూడా అనుమానాలు ఉన్నాయని, జ్యోతి మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. దీంతో నిన్న జ్యోతి మృతదేహానికి కుటుంబసభ్యుల సమక్షంలో రీపోస్ట్ మార్టం చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మాజీ ప్రియుడి పనేనా?
‘జిరాక్స్‌ తీసుకుని.. అక్కడే ఫ్రైడ్‌ రైస్‌ తిన్నారు’
‘జ్యోతి మృతిపై అనుమానాలున్నాయి’

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా