వైఎస్‌ వివేకా మృతి హత్య కేసుగా నమోదు

15 Mar, 2019 16:53 IST|Sakshi

వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యగానే భావిస్తున్నాం: ఎస్పీ

సాక్షి, పులివెందుల : వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి  వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యగానే తాము భావిస్తున్నట్లు ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...నిన్న రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ఏం జరిగిందో విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇం‍ట్లో ఉన్న పనిమనుషులను అందరినీ విచారణ చేస్తున్నాం. ఘటనా స్థలంలో వేలిముద్రలు దొరికాయని, మరిన్ని ఆధారాల కోసం అన్వేషిస్తున్నామని రాహుల్‌ దేవ్‌ శర్మ వెల్లడించారు. చదవండి...(వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యే!)

హత్య కేసుగా నమోదు
మరోవైపు వైఎస్‌ వివేకానందరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ముందుగా కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం హత్యకేసుగా మార్చారు. ఇవాళ ఉదయం వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్‌ 171 కింద కేసు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక అనంతరం అనుమానాస్పద మృతి సెక్షన్‌ను 302 సెక్షన్‌ కింద మార్చారు. 

సీబీఐ విచారణ జరపాలి
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, చంద్రబాబు జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలేనని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు.

మరిన్ని వార్తలు