బోటు ఆచూకీ లభ్యం.. మత్స్యకారులు సురక్షితం

16 Aug, 2018 16:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తూర్పుగోదావరి జిల్లా: కాకినాడ దమ్ములపేటకు చెందిన ఫిషింగ్‌ బోటు ఆచూకీ లభ్యమైంది. అందులో ఉన్న మత్స్యకారులందరూ సురక్షితంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్న సమీపంలో ఉన్నట్లు కుటుంబసభ్యులకు బోటులోని మత్స్యకారులు తెలిపారు. బోటులో ఆయిల్‌ అయిపోవడంతో ఈ గందరళగోళం ఏర్పడిందని మత్స్యకారులు తెలిపారు. ఆయిల్‌ అయిపోయిన విషయాన్ని బోటు యజమాని దృష్టికి తీసుకెళ్లినట్లు మత్స్యకారులు తెలిపారు.  

దమ్ములపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 7న కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లారు. మత్స్యకారులు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బాధితుల కుటుంబసభ్యులు ప్రభుత్వాధికారుల దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్న సంగతి తెల్సిందే. దీంతో జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని కోస్టుగార్డులను కోరారు. అయితే మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని తెలియడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు