మలేషియా జైల్లో మనోళ్లు బందీ

22 Jul, 2019 13:54 IST|Sakshi
దర్శన్‌రెడ్డి(ఫైల్‌)

కన్సల్టెన్సీ మోసానికి జైలుపాలు

ఆందోళనలో కుటుంబ సభ్యులు

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలోని బీడీ వర్కర్స్‌ కాలనీకి చెందిన దర్శన్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌ మూడు నెలల క్రితం ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీకి చెందిన ఓ కన్సల్టెన్సీని సంప్రదించారు. వారు మంచి ఉద్యోగం చూపిస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్దనుంచి రూ.1.90 లక్షలు వసూలు చేశారు. మంచి ఉద్యోగం ఉందని చెప్పి ముందుగా సదరు కన్సల్టెన్సీ జార్జియా దేశానికి పంపించింది. అక్కడ దిగగానే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వీసా నకిలీదంటూ ఎయిర్‌పోర్టు నుంచే తిరిగి పంపించేశారు. తిరిగి వచ్చిన ఇద్దరు యువకులు ఇదేమిటని కన్సల్టెన్సీని నిలదీయగా.. ఎక్కడో పొరపాటు జరిగిందని, మంచి ఉద్యోగాలు మలేషియాలో ఇప్పిస్తామని మరోసారి నమ్మించారు.

మలేషియాకు విజిట్‌ వీసా ఇప్పించి, అక్కడికి చేరిన తర్వాత ఎంప్లాయిమెంట్‌ వీసా ఇప్పిస్తామని చెప్పి పంపించారు. వారు మలేషియా చేరగానే సదరు కన్సల్టెన్సీ చేతులు దులుపుకుంది. దీంతో మలేషియాలో ఎక్కడుండాలి, ఏం చేయాలో తెలియని ఆ యువకులు.. దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తిరుగు ప్రయాణానికి అయ్యే ఖర్చులు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎవరూ పని ఇవ్వకపోవడంతో సాధ్యపడలేదు. ఈలోగా వీసా గడువు పూర్తయిపోయింది. గడువు ముగిసిన తర్వాత అక్కడి పోలీసులు వారిని పట్టుకుని జైల్లో పెట్టారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

ప్రస్తుతం మలేషియా జైల్లో ఉన్న తుమ్మల దర్శన్‌రెడ్డి అనే యువకుడి తండ్రి రాజిరెడ్డి సౌదీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తల్లి సుగుణ కామారెడ్డి బీడీ వర్కర్స్‌ కాలనీలో నివసిస్తున్నారు. కుమారుడు జైలు పాలయ్యాడని తెలియడంతో ఆమె ఆందోళన  చెందుతున్నారు. తన కుమారుడు క్షేమంగా ఇంటికి తిరిగి రావడానికి ప్రభుత్వం సహాయం చేయాలని వేడుకుంటున్నారు. నకిలీ వీసాలను అంటకట్టి లక్షల్లో దండుకున్న కన్సల్టెన్సీపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాల సభ్యులు కోరుతున్నారు.

విడిపించేందుకు ప్రయత్నిస్తున్నాం 
కన్సల్టెన్సీ మోసాలకు గురై మలేషియా జైల్లో మగ్గుతున్న యువకులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మలేషియాలో ఏవైనా చిన్న కారణాల చేత జైల్లో చిక్కుకున్న వారికి అక్కడి ప్రభుత్వం క్షమాభిక్షను అమలు చేస్తోంది. దర్శన్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌లను స్వదేశానికి తిరిగి పంపించడానికి అధికారులతో సంప్రదిస్తున్నాం.  
– ఏళ్ల రాంరెడ్డి,  ప్రవాసీమిత్ర అవార్డు గ్రహీత, సింగపూర్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అవమానాలు భరించ లేకున్నా.. వెళ్లిపోతున్నా..

మత్తులో కత్తులతో వీరంగం!

మోసగాడు.. ఇలా దొరికాడు

ఆషాఢమని భార్య పుట్టింటికి వెళితే..

ప్రేమ జంటలే టార్గెట్‌

‘ఆ ఊహనే భరించలేకున్నా.. చనిపోతున్నా’

వివాహేతర సంబంధమా.. వ్యాపారుల మధ్య పోటీయా..?

ట్రాక్టర్‌ డ్రైవర్‌ దారుణహత్య

హిజ్రా చంద్రముఖి ఫిర్యాదు..

వందల కోట్లు లంచంగా ఇచ్చా

భర్త, కుమారుడిని వదిలేసి సహజీవనం.. ఆత్మహత్య

బాలికపై సామూహిక లైంగికదాడి

ఇంటి పైకప్పు కూలి చిన్నారి దుర్మరణం

కుప్పంలో దొంగనోట్ల ముఠా!

ఎంపీ గల్లా అనుచరులపై కేసు

అనసూయ పేరుతో అభ్యంతరకర పోస్టులు

ప్రేమ వ్యవహారమేనా..?

సౌదీలో పరిచయం.. తమిళనాడులో సంబంధం

బ్యూటీషియన్‌ దారుణ హత్య

అమెరికాలో పూజారిపై దాడి

హైదరాబాద్‌కు ఐసిస్‌ నమూనాలు!

ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌పై మరో కేసు

షేక్ సద్దాంను హత్య చేసిన నిందితుల అరెస్ట్‌

ఉపాధ్యాయుల ఇళ్లలో భారీ చోరీ

నిరుద్యోగులే టార్గెట్‌.. రూ.కోటితో ఉడాయింపు!

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం

ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించేశాడు..!

రక్తంతో గర్ల్‌ఫ్రెండ్‌కు బొట్టుపెట్టి..

పింకీ! నీవెలా చనిపోయావో చెప్పమ్మా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి