పాక్‌వాసికి సహకరించిన కరీంనగర్‌ వ్యక్తి 

4 Jun, 2018 01:47 IST|Sakshi

కరీంనగర్‌ క్రైం: పాకిస్తాన్‌ పౌరుడికి భారత పాస్‌పోర్టు ఇప్పించడంలో కరీంనగర్‌వాసి కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్‌ సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి ఆధ్వర్యంలోని పోలీసుల బృందం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్‌ ఇక్రమ్‌ అలియాస్‌ మహ్మద్‌ అబ్బాస్‌ తాను ఢిల్లీకి చెందిన వ్యకిగా చెప్పుకుని హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన మహిళను దుబాయ్‌లో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.

అనంతరం ఇండియాకు వచ్చిన తర్వాత భారత పాస్‌పోర్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో కరీంనగర్‌లో ఓ ప్రైవేటు కాలేజీ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఎండీ మక్సూద్‌ అహ్మద్‌ను సంప్రదించారు. మక్సూద్, మహ్మద్‌ ఇక్రమ్‌కు అతని పేరు మీద టెన్త్, ఇంటర్, డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లు అందించాడు. వాటితో ఇక్రమ్‌ పాస్‌పోర్టు సంపాదించాడు. మక్సూద్‌ కొంతకాలంగా పలువురికి నకిలీ సర్టిఫికెట్లు సరఫరా చేస్తున్నాడని సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ కూడా రంగంలోకి దిగినట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు