కారుకింద తోసి చంపిన డీఎస్పీ.. అనుమానాస్పద మృతి

13 Nov, 2018 15:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాంగ్‌ పార్కింగ్‌ అంటూ.. ఓ వ్యక్తి మృతికి కారణమైన డీఎస్పీ

వారం రోజులుగా పరారీలో నిందితుడు

కల్లంబాల్లంలోని ఓ ఇంటిలో శవమై కనిపించిన వైనం

తిరువనంతపురం : పార్కింగ్‌ నిషేదించిన చోట కారు నిలిపాడని నెయ్యంతికర డీఎస్పీ హరికుమార్‌ ఓ వ్యక్తిని నెట్టేసి అతని మృతికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్‌ హరికుమార్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించారు కూడా. అయితే, 34 ఏళ్ల సనాల్‌ మృతికి కారణమైన హరికుమార్‌ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. కల్లంబాల్లంలోని ఓ ఇంటిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. కాగా, ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యా.. ఆత్మహత్యా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (మాట్లాడుతుండగానే కారుకింద తోసేశాడు..!)

ఇదిలాఉండగా.. సనాల్‌ మృతి చెందినప్పటి నుంచి (నవంబర్‌,5) పరారీలో ఉన్న హరికుమార్‌ను పట్టుకునేందుకు పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. కేరళతో పాటు తమిళనాడులో సైతం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, హరికుమార్‌ను ఈ కేసు నుంచి తప్పించేందుకు అధికార కమ్యూనిస్టు పార్టీ యత్నిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలు విమర్శలు గుప్పించాయి. నిందితున్ని పట్టుకోవడంలో కావాలనే జాప్యం చేస్తోందని పోలీసు శాఖపై ఆరోపణలు చేశాయి. సనాల్‌ మృతి అనంతరం డీఎస్పీ హరికుమార్‌ పారిపోయేందుకు సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు