మితిమీరిన అతివేగం, యువకుడి మృతి

18 Sep, 2019 15:26 IST|Sakshi

తిరువనంతపురం : మితిమీరిన అతివేగం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. కేరళలోని తిరువనంతపురంకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడు తన కొత్త స్కోడా కారులో అతి వేగంగా వెళుతుండగా, అదుపు తప్పి ఓ ఆటోను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన గత రాత్రి 10.45 గంటలకు చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కాగా, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కారు డోర్లు తెరిచి, అందులోని వారిని బయటకు తీశారు. కాగా కారుకు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ మాత్రమే చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-కారు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు.

మరిన్ని వార్తలు