అత్తారింటికి వెళ్లి.. హత్యకు గురయ్యాడు

11 Oct, 2019 10:08 IST|Sakshi
మద్దూరులో ఆంజనేయులు శవాన్ని వెలికితీస్తున్న పోలీసులు; ఆంజనేయులు (ఫైల్‌)

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

బంధువుల సమక్షంలో శవం వెలికితీత

మద్దూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

సాక్షి, దేవరకద్ర: ప్రియుడితో కలిసి ఓ భార్య భర్తను హతమార్చి పూడ్చిపెట్టింది. ఈ సంఘటన మండలంలోని మద్దూరులో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ పాండురంగారెడ్డి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పాన్‌గల్‌ మండలం కేతేపల్లికి చెందిన ఆంజనేయులు(40)కు చిన్నచింతకుంట మండలం మద్దూరు చెందిన రాములమ్మతో గత 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన ఐదేళ్ల నుంచి తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో రాములమ్మ భర్త ఆంజనేయులుతో గొడవపడి ఐదేళ్ల క్రితం తల్లిగారి ఊరైన మద్దూరుకు ఐదేళ్ల క్రితం తిరిగి వచ్చింది. అయితే గత నెల 23న రాములమ్మ తల్లికి ఆరోగ్యం బాగోలేదన్న విషయం తెలుసుకున్న ఆంజనేయులు అదేరోజు మద్దూరుకు వచ్చాడు. ఆ తర్వాత ఆంజనేయులు అదృశ్యమయ్యాడు.  

అదృశ్యంపై కేసు నమోదు 
ఈ నెల 5న రాములమ్మ తన భర్త ఆంజనేయులు  కనిపించడం  లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానంతో రాములమ్మ, ఆమె ప్రియుడు సలీం, రాములమ్మ తమ్ముడు రాజు ముగ్గురు కలిసి ఆంజనేయులును గత నెల 23న హత్య చేసినట్లు సలీం ఒప్పుకున్నాడు. ఈ మేరకు గురువారం శవాన్ని పూడ్చిన స్థలాన్ని చూయించగా కుటుంబ సభ్యుల సమక్షంలో శవాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కటుంబ సభ్యులకు అప్పగించారు. ఆంజనేయులుకు భార్యతోపాటు ఒక కూతురు ఉంది. 

పాన్‌గల్‌ (వనపర్తి): మండలంలోని కేతేపల్లికి ఆంజనేయులు అత్తగారింటికి వెళ్లి హత్యకు గురవడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన బండలయ్య, బాలకిష్టమ్మ దంపతుల రెండో కుమారుడు ఆంజనేయులు. అయితే భార్య రాములమ్మకు వివాహేతర సంబంధం ఉండటంతో ఆంజనేయులును హత్య చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా