కారు బోల్తా.. కియా ఉద్యోగి మృతి

16 May, 2019 12:07 IST|Sakshi
ప్రమాదానికి గురైన కారు , మృతుడు మిన్‌ కియోంగ్‌ జిన్‌

అనంతపురం , చిలమత్తూరు: కొడికొండ చెక్‌పోస్టు రక్షా అకాడమీ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున కారు బోల్తా పడిన ఘటనలో కియా ఉద్యోగి అయిన కొరియా దేశస్తుడు మృతి చెందాడు. ఎస్‌ఐ ధరణీబాబు తెలిపిన వివరాల మేరకు... పెనుకొండ సమీపంలోని కియా కార్ల ఉత్పత్తి పరిశ్రమలో కొరియా దేశానికి చెందిన మిన్‌ కియోంగ్‌ జిన్‌ (40), జేహిలీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. బుధవారం బెంగుళూర్‌ విమానశ్రయం నుంచి అద్దె కారులో (ఏపీ02సీసీ 7233) పెనుకొండ వైపు వస్తున్నారు. రక్షా అకాడమీకి సమీపంలోకి రాగానే అధిక వేగంతో వస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడడంతో డ్రైవర్‌ కేశవ్‌నాయక్,  జేహిలీ, మిన్‌ కియోంగ్‌ జిన్‌(41)లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బాగేపల్లి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగుళూర్‌లోని కొలంబియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మిన్‌ కియోంగ్‌ జిన్‌ మృతి చెందాడన్నారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. 

మరిన్ని వార్తలు