కిడ్నాప్‌ కథ సుఖాంతం

31 Jan, 2018 12:03 IST|Sakshi
బాలుడు ఉదయ్‌తేజ్‌

సాక్షి, జీడిమెట్ల: హైదరాబాద్‌ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. పది రోజుల క్రితం గాజులరామారం  చిత్తారమ్మ జాతరలో ఉదయ్‌తేజ్‌ అనే బాలుడు కిడ్నాప్‌ అయ్యాడు. కేసు నమోదు చేసుకున‍్న జీడిమెట్ల పోలీసులు డీసీపీ సాయిశేఖర్ ఆదేశాల మేరకు సవాల్‌గా తీసుకున్నారు. పోలీసులు 11 బృందాలతో గాలింపు చేపట్టి వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. దీంతో భయపడ్డ కిడ్నాపర్లు ఉదయ్‌తేజ్‌ను సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పొలంలో తెల్లవారు జామున వదిలి వెళ్లారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు గీశారు. జీడిమెట్ల పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు సిద్దిపేటకు చేరుకున్నారు. మరికాసేపట్లో హైదరాబాద్‌కు తరలించనున్నారు.

మరిన్ని వార్తలు