తల్లి ఒడికి చేరిన పసికందు

9 May, 2019 16:07 IST|Sakshi

మెదక్‌జోన్‌: సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మూడ్రోజుల క్రితం మాయమైన శిశువు ఆచూకీ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో లభ్యమైంది. శిశువును తల్లి ఒడికి చేర్చిన పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు ప్రథమ చికిత్స కోసం మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు తరలించారు. 15 రోజుల క్రితం మాధవి ప్రసూతి కోసం సంగారెడ్డి మాతా శిశు ఆస్పత్రికి వచ్చి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 7న గుర్తు తెలియని ఓ వ్యక్తి శిశువు ను తీసుకెళ్లడం ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. శిశువును ఎత్తుకెళ్లిన ఆ వ్యక్తి ఓ మహిళకు అందజేసినట్లు సీసీటీవీ ద్వారా తెలిసింది.

విచారణ ప్రారంభించిన సంగారెడ్డి పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు సమాచారం అందించారు. గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం శివనగర్‌ గ్రామానికి చెందిన సంతోష్‌–శోభ దంపతులు శిశువును ఎత్తుకొని అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పోలీసులు విచారించగా అసలు విషయం బయటికొచ్చింది. విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శిశువు తల్లిదండ్రులు మాధవి–మల్లేశానికి సమాచారం అందించారు. శిశువును అపహరించిన నిందితులు ప్రస్తుతం సంగారెడ్డి పోలీసుల కస్టడీలో ఉన్నారు. శిశువును ఎండలో తిప్పడం వల్ల డీహైడ్రెషన్‌కు గురైనట్లు మెదక్‌ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు.  

నిందితులు కామారెడ్డి జిల్లా
వాసులే: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి సమీపంలోని శివనగర్‌ గ్రామంలో నిందితులను గుర్తించామని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. బంగారు సంతోష్, శోభ దంపతులను అదుపులోనికి తీసుకొని విచారించగా.. తమ కూతురు కరుణకు రెండవ కాన్పులో ఆడపిల్ల ఆస్పత్రిలో మరణించిందని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పకుండా అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు.  సంగారెడ్డి ఆస్పత్రిలో నిందితురాలు శోభ ఎస్‌ఎన్‌సీయూ వార్డు దగ్గర ఉండి ఆయా తీసుకొచ్చిన బిడ్డకు తానే తల్లినని చెప్పి తీసుకుని ఆస్పత్రి బయటకు వెళ్లిందని చెప్పారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రియుడితో పరారైన వివాహిత

వదినతో వివాహేతర సంబంధం

నిర్లక్ష్యం ఖరీదు.. రెండు ప్రాణాలు

అనుమానాస్పద స్థితిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మృతి

మిస్టరీగానే తెలుగు కుటుంబ మరణాలు

పోలీసులు X టెంపో డ్రైవర్‌

కేరళలో ఎస్కేప్‌... శంషాబాద్‌లో అరెస్టు! 

ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

ఏసీబీ వలలో బొల్లారం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

మాజీ ప్రేయసికి గుణపాఠం చెప్పాలని..

కుళ్లిన కూతురి శవంతో నెలరోజుల పాటు.. 

97 మంది మృతి: కేంద్రమంత్రిపై కేసు నమోదు

నిర్మాణంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ కూలి ముగ్గురి మృతి

గుడిలో మద్యం వద్దన్నందుకు పూజారికి కత్తిపోట్లు

విహార యాత్రలో విషాదం..

కాళ్ల పారాణి ఆరకముందే..

కొనసాగుతున్న టీడీపీ దాడులు

చెల్లెలు గృహప్రవేశానికి వెళ్తూ అన్న మృతి

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ఆరిన విద్యా దీపం

బెజవాడ.. గజ గజలాడ!

అసభ్యంగా దూషించిందని..

పెట్టుబడులే ముంచేశాయి!

ప్రేమికుడిపై యాసిడ్‌ దాడి

పారిశ్రామికవేత్త ఇంట్లో ఎన్‌ఆర్‌ఐ హల్‌చల్‌

శోభనాన్ని అడ్డుకున్నాడని కన్న తండ్రిని..

వృద్ధ దంపతుల దారుణ హత్య

‘షేర్‌’ ఖాన్‌లు జాగ్రత్త!

అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం

అమెరికాలో దారుణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సగం పెళ్లి అయిపోయిందా?

ప్రయాణం మొదలు

గురువుతో నాలుగోసారి

పచ్చడి తిని ఆఫీసుకెళ్లారు

రాజా నరసింహా

ఆ నమ్మకంతోనే కల్కి విడుదల చేస్తున్నాం