వదినపై మరిది దాడి

12 Jun, 2020 11:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మీర్‌పేట: వదినతో గొడవపడిన మరిది ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మీర్‌పేట ప్రగతినగర్‌కు చెందిన మరక మంజులాదేవి (37) జలమండలిలో డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పని చేసేది. ఆమె భర్త విష్‌దేవ్‌లో అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె వరణియ తేజ, అత్త జ్యోతితో కలిసి ఉంటోంది. గురువారం ఉదయం మరిది నారదేవ్‌తో ఇంట్లో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో ఆగ్రహానికి లోనైన నారదేవ్‌ కత్తితో మంజులాదేవిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీనిని గుర్తించిన అమె కుమార్తె సమీపంలో ఉంటున్న మంజులాదేవి సోదరికి సమాచారం అందించడంతో వారు ఆమెను చికిత్స నిమిత్తం అపోలో డీఆర్‌డీఓ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు