నాంపల్లిలో భయం..భయం..

22 Apr, 2019 08:11 IST|Sakshi

నాంపల్లి: హైదరాబాదు రైల్వే స్టేషన్‌ ఎదుట పోకిరీల బెడద ఎక్కువైపోంది. నానాటికి వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అటు సందర్శకులను ఇటు పోలీసులను బెంబేలెత్తిస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్, పబ్లిక్‌గార్డెన్‌ గేటును అడ్డాగా చేసుకుని జీవిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నిలోఫర్‌ ఆసుపత్రి వద్ద దాతలు వడ్డించే భోజనాలు స్వీకరిస్తారు. భోజనాలు ఆరగించిన పోకిరీలు నాంపల్లి సరాయికి చేరుకుంటారు. అక్కడే చెట్ల కింద సేదతీరుతూ వచ్చి పోయే వారిని ఇబ్బందులకు గురిచేస్తుంటారు. సరాయి పక్కనే ఉండే మోతి వైన్స్‌ దగ్గర ప్రయాణికుల జేబులు, ఎండ వేడిమికి చెట్ల కింద సేదతీరే సందర్శకుల జేబులను కొట్టేస్తుంటారు. ఇలా కొట్టేసిన డబ్బు పంచుకునే క్రమంలో విభేదాలు వచ్చి హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతారు. గడచిన ఏడాది కాలంలో మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు జరిగాయి. హత్యలు చేసిన పోకిరీలు పరావుతుంటారు. పరారైన వారిని పట్టుకునేందుకు స్థానిక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. 

ఇక రాత్రి వేళల్లో ట్యాక్సీ స్టాండ్‌ కేంద్రంగా హిజ్రాలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. తమ దగ్గరకు వచ్చిన విటులను ఒళ్లును గుల్ల చేసి పంపుతున్నారు. కాదు కూడదంటే దౌర్జాన్యాలకు పాల్పడి చంపేస్తున్నారు. మితిమీరిపోతున్న పోకిరీలు, హిజ్రాలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంది. వీరి స్థావరాలపై దాడులు చేసి నాంపల్లిలో నిలువకుండా చూడాలని  పలువురు కోరుతున్నారు. అలాగే నిలోఫర్‌ ఆసుపత్రి ఎదుట అన్నదానాలు చేసే దాతలు రోగి సహాయకులకు కాకుండా పోకిరీలకు అన్నం వడ్డించకుండా చర్యలు తీసుకోవాలి.  అంతేకా>కుండా నాంపల్లి రైల్వే స్టేషన్‌ ఎదుట అధునాతన భవన నిర్మాణం పేరుతో కూల్చివేసిన ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్, లా అండ్‌ ఆర్డర్‌ ఔట్‌ పోస్టు ఉండేందుకు భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి.

స్టేషన్‌ ఎదుట గుర్తుతెలియని వ్యక్తిపై కత్తితో దాడి...  
ఆదివారం మధ్యాహ్న పోకిరీలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యారు. గాయాలపాలైన వ్యక్తిని హుటా హుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తి కోసం నాంపల్లి పోలీసులు గాలిస్తున్నారు. దాడిలో గాయపడ్డ వ్యక్తి ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రియురాలు మాట్లాడటం లేదని..

నాడు ముగ్గురు.. నేడు ఒకరు

తండ్రి మందలించాడని..

భార్య మృతితో గుండె పగిలిన భర్త

రవిప్రకాశ్‌కు చుక్కెదురు 

‘హీరా’ కేసులో ఆడిటర్‌ సాయం!

కోచింగ్‌ సెంటర్‌లో మంటలు.. 20 మంది విద్యార్థుల దుర్మరణం

నూజివీడులో ఘోరం

ఎన్సీఎల్టీలో రవిప్రకాష్‌కు చుక్కెదురు!

భార్యపై అనుమానం..కూతురి హత్య

ఘోర అగ్నిప్రమాదం; 15 మంది విద్యార్థులు మృతి!

స్కూటీ నడుపుతుండగా బీపీ వచ్చి..

విశాఖ ఎయిర్‌పోర్టులో మళ్లీ కత్తి కలకలం

బోధన్‌లో దారుణం

అక్కడా.. ఇక్కడా పెళ్లి..

నాలుగు నెలల్లో రూ.32 కోట్లు లూటీ

సూట్‌ కేసులో మహిళ మృతదేహం

శుభకార్యానికి వెళ్లి వస్తూ..

కుమార్తెతో సహా మహిళ అదృశ్యం.. పక్కింటి యువకుడిపై

అన్నదమ్ములు దారితప్పి..దొంగలయ్యారు

మరిదితో వివాహేతర సంబంధం.. దారుణ హత్య

ప్రియురాలి తండ్రి కిడ్నాప్‌

వివాహమైన వారానికే.. దారుణహత్య

సరుకు లేకుండానే రూ.133 కోట్ల వ్యాపారం

పోలీసులు అరెస్ట్‌ చేస్తారని.. గోడ దూకి పారిపోయా

సెల్‌ఫోన్‌ చోరీ వివాదం.. యువకుడి హత్య

ముఖంపై చిరునవ్వు.. మీసంపై చెయ్యి: సెల్ఫీసూసైడ్‌

సోలార్‌ ప్లాంటేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

వరుడు పెళ్లి చేసుకోనన్నాడని..

రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సీత’ మూవీ రివ్యూ

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

అందరూ కనెక్ట్‌ అవుతారు