కొండ మృతదేహం లభ్యం

21 Dec, 2019 12:00 IST|Sakshi
మూటకట్టి ఉన్న కొండ మృతదేహం, పక్కన ద్విచక్రవాహనం

గుంటూరు, తంగెడ(దాచేపల్లి) :  హత్య చేసి అనంతరం మృతదేహాన్ని ద్విచక్రవాహనానికి కట్టి కృష్ణానదిలో పడవేశారు. మూడు రోజులుగా నదిలో మృతదేహం కోసం గాలిస్తున్నారు.  ఎట్టకేలకు శుక్రవారం మృతదేహం లభ్యమైంది. లభించిన  మృతదేహంను మాచవరం మండలం వేమవరానికి చెందిన మాగంటి కొండగా గుర్తించారు. సంఘటన స్థలంను పిడుగురాళ్ల సీఐ సురేంద్రబాబు, మాచవరం ఎస్‌ఐ లక్ష్మీనారాయణరెడ్డి సందర్శించారు. కొండ అదృశ్యంపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పలువురిని పోలీసులు విచారణ చేయగా కొండను హత్యచేసి తంగెడ కృష్ణానదిలో పడవేసినట్లు అంగీకరించారు. దీంతో  ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యులు కృష్ణానదిలో గత మూడు రోజులుగా  గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం గాలింపు చేసిన మృతదేహం ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో తంగెడలో ఉన్న మత్యకారుల సహకారాన్ని పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ తీసుకున్నారు.

నదిలో ఉన్న మృతదేహంను గుర్తించేందుకు మత్యకారులు ప్రత్యేకంగా లంగర్లు తయారు చేయించారు. శుక్రవారం ఉదయం తంగెడ కృష్ణానది బ్రిడ్జికి తూర్పువైపు 65 అడుగుల లోతులో ఐదుసార్లు లంగర్లు వేసినా ఆచూకీ లభించలేదు. ఆరోసారి లంగరు నదిలోకి వదలటంతో తీగెలాగుతుండగా బరువు తగిలినట్టుగా గుర్తించారు. లంగరు జారిపొకుండా పటిష్టపరచి బయటకు తీశారు. మృతదేహంను గోతంలో పెట్టి మూటకట్టి ద్విచక్రవాహనంకు కట్టేసి ఉండటాన్ని గమనించారు. ద్విచక్రవాహనంను, మృతదేహంను బయటకు తీశారు. మూటలో కట్టిన మృతదేహం నుంచి తీవ్ర దుర్వాసన వచ్చింది. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు మృతదేహం, ద్విచక్రవాహనంను పరిశీలించారు. కృష్ణానది వద్ద మృతదేహంను శచపంచనామా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్‌ కవర్లు చుట్టి గోతంలో పెట్టారు.  కృష్ణానది వద్దకు చేరుకున్న కొండ కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ  ఆందోళనకు దిగారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు