గ్యాంగ్‌రేప్‌ కేసులో  కలెక్టర్, ఎస్‌పీలకు నోటీసులు

22 Apr, 2018 08:00 IST|Sakshi

జయపురం :  కొరాపుట్‌ జిల్లా కుందులి సమీప అడవిలో ఓ బాలిక సామూహిక గ్యాంగ్‌రేప్‌కు గురైందన్న ఆరోపణల కేసులో ఈ నెల 24 వ తేదీన తమ ముందు హాజరు కావాల్సిందిగా  కొరాపుట్‌ కలెక్టర్, ఎస్‌పీలకు జాతీయ ఎస్‌సీ కమిషన్‌ నోటీసులు పంపింది. ఇద్దరు   అధికారులు తమతమ వాదనలు వ్యక్తిగతంగా  వినిపించేందుకు అవసరౖయెన డాక్యుమెంట్స్‌తో ఢిల్లీలో తమ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు   సమాచారం.

సొరిసిగుడ గ్రామం ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న ముసిగుడ గ్రామానికి చెందిన 14 యేళ్ల బాలిక గత  ఏడాది అక్టోబర్‌ 10వ తేదీన కుందులి గ్రామంలో ఫొటోలు తీయించుకుని  గ్రామానికి వెళ్తున్న సమయంలో  జవాన్‌ దుస్తులు ధరించిన సాయుధులైన నలుగురు వ్యక్తులు ఆమెను ఎత్తుకు పోయి సమీప అడవిలో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారని  ఆరోపణ. ఆ సంఘటన జరిగిన మూడు నెలల తరవాత ఆమె అబద్ధం చెబుతోందని అసలు లైంగికదాడి   జరగలేదని మెడికల్‌ రిపోర్టులు వెల్లడిస్తునాయని అధికారులు స్పష్టం చేశారు. కొరాపుట్‌ ఎస్‌పీ  విలేకరుల   సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. బాధితురాలు జనవరిలో ఆత్మహత్య చేసుకుని మరణించింది. 

బాధితురాలి బంధువులకూ ఆహ్వానం
రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన  ఈ సంఘటనపై బాధితురాలి బంధువులు, కొరాపుట్‌ కాంగ్రెÜస్‌ ఎంఎల్‌ఏ కృష్ణ చంద్ర సాగరియలు జాతీయ ఎస్‌సీ కమిషన్‌ను ఆశ్రయించారు.  వారి ఫిర్యాదును  కమిషన్‌ పరిగణలోనికి తీసుకుని  కొరాపుట్‌ కలెక్టర్‌ కె.సుదర్శన చక్రవర్తి, ఎస్‌పీ డా.కనేశ్వర విశాల్‌ సింగ్‌లకు నోటీసులు పంపుతూ ఈ నెల 24 వ తేదీన ఆ కేసులపై విచారణ జరపనున్నట్లు ఢిల్లీలోని తమ కార్యాలయానికి ఆ రోజున వ్యక్తిగతంగా హాజరు కావాలని  నోటీసుల్లో స్పష్టం చేసింది.  ఎస్‌సీ  కమిషన్‌ అధ్యక్షుడు   ప్రొఫెసర్‌ రామశంకర్‌ కటేరియ, కమిటీ సభ్యుడు జోగేంద్ర పాశ్వాన్‌లు కుందులి బాధితురాలి కేసు విచారణ ప్రారంభించి  వాదనలను వింటారని సమచారం. ఆనాటికి ఫిర్యాదు దారులు కూడా రావాలని కమిషన్‌ సూచించినట్లు సమాచారం.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు