కర్నూలు హౌసింగ్‌ ఈఈ ఆత్మహత్య

9 Jan, 2020 08:35 IST|Sakshi

పని ఒత్తిడి వల్లే అంటూ భార్య ఫిర్యాదు..

సాక్షి, కర్నూలు : జిల్లా గృహ నిర్మాణ సంస్ధ కర్నూలు ఈఈ కె. సత్యప్రసాద్‌ రెడ్డి(58) బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన సొంతూరు అనంతపురం జిల్లా కదిరి పట్టణం. ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌లో హౌసింగ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్‌కు ఆయన గైర్హజరు కావడంతో సహచర ఉద్యోగులు ఫోన్‌ చేశారు. ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో కారు డ్రైవర్‌కు ఫోన్‌ చేయగా డ్రైవర్‌ ఇంట్లోకి వెళ్లి  చూడగా ఈఈ ఉరి వేసుకుని కనిపించారు. డ్రైవర్‌ వెంటనే సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాడు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన సతీమణి కె హరిత, కూతురు వర్ణితారెడ్డికి సమాచారం ఇవ్వగా.. వారు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఈఈ సత్యప్రసాద్‌రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తమకు తెలియవని, పని ఒత్తితడి ఉందని ఆయన సతీమణి ఇచ్చిన ఫిర్యాదు మేరు కేసు నమోదు చేశామని మూడో పట్టణ సీఐ తబ్రేజ్‌ చెప్పారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దారుణం: 8 ఏళ్ల బాలికపై బంధువు అత్యాచారం

ప్రాణం తీసిన 'తబ్లిగి జమాత్‌' వివాదం

హత్య వెనుక ప్రేమ వ్యవహారం

సొంతింటికే కన్నం.. భర్తకు తెలియకుండా..

అనుమానం పెనుభూతమై.. 

సినిమా

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!