ప్రాణం తీసిన భూ వివాదం

28 Jun, 2019 11:30 IST|Sakshi
దాడిలో మృతిచెందిన శ్రీనివాస్‌గౌడ్‌ (ఫైల్‌)

దాడికి పాల్పడిన ఐదుగురిపై హత్యకేసు నమోదు 

సాక్షి, నర్సాపూర్‌రూరల్‌: భూవివాదంలో దాయదుల మధ్య ఘర్షనలో  ఒకరు మృతి చెందిన సంఘటన నర్సాపూర్‌ మండలం రెడ్డిపల్లిలో బుధవారం రాత్రి జరిగింది. నర్సాపూర్‌ సిఐ సైదులు, ఎస్సై సందీప్‌రెడ్డిలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెడ్టిపల్లి గ్రామానికి చెందిన శివ్వన్నగారి శ్రీనివాస్‌గౌడ్‌ (43)పై  భూవివాదంపై దాయదులు వీరగౌడ్, చంద్రకళ, నిఖిల్‌గౌడ్, మధుగౌడ్‌లు కలిసి దాడికి పాల్పడ్డారు. దీంతో శ్రీనివాస్‌గౌడ్‌ స్పృహాకోల్పోవడంతో అతన్ని స్థానికులు నర్సాపూర్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృత్యువాత పడ్డాడు.

మృతుని తండ్రి సత్యగౌడ్‌ పిర్యాదు మేరకు బుధవారం కేసునమోదు చేసుకొన్నారు. గురువారం గ్రామంలో సంఘటన జరిగిన ప్రదేశంలో సీఐ సైదులు, ఎస్సై సందీప్‌రెడ్డిలు అన్ని కోణాలో విచారణ చేపట్టిన అనంతరం దాయదులు వీరగౌడ్, చంద్రకళ, నిఖిల్‌గౌడ్, మధుగౌడ్‌లు కలిసి శ్రీనివాస్‌గౌడ్‌ను కిందిపడేసి పిడిగుద్దులు గుద్దడంతోనే ప్రాణాలు వీడిచినట్లు తెలిపారు.

శ్రీనివాస్‌గౌడ్‌ మృతదేహన్ని పరిక్షించిన వైద్యులు సైతం చాతి తదితతర బాగలో గుద్దులు తగలడంతోనే మృతిచెందినట్లు నిర్థారించినట్లు చెప్పారు. ఈమేరకు పై నలుగురిపై హత్య కేసు నమోదు చేసి శవానికి పోస్టుమార్టు నిర్వహించిన అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం నాలుగు గంటలకు మృతుడు శ్రీనివాస్‌గౌడ్‌ అంత్యక్రియలు నిర్వహించారు.  

భార్య గర్భిణి
మృతుడు శ్రీనివాస్‌గౌడ్‌ ఎప్పుడు ఎవ్వరి జోలికి వెల్లకుండ ప్రశాంతంగా ఉండాడంతోపాటు అందరితో కలుపుగొలుగా ఉండేవాడు, గత రెండేళ్ళ క్రితం శ్రీనివాస్‌గౌడ్‌ భర్య పురిటినొప్పుల సమయంలో మృత్యువాత పడింది, దీంతో ఏడాది క్రితం నర్సాపూర్‌ మండల విద్యాధికారి కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న రూపను వివాహం చేసుకున్నాడు.

 ప్రస్తుతం రూప గర్భవతి, మందు భార్యకు ఇద్దురు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్‌గౌడ్‌కు విదిచేసిన అన్యాయన్ని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. బుధవారం రాత్రి నుంచి గురువారం అంత్యక్రియలు పూర్తి అయ్యేవరకు గ్రామంలో విషాధచాయలు అలుముకొన్నాయి.  

మరిన్ని వార్తలు